#FlaxSeeds : అవిసె గింజలు తింటే క్యాన్సర్ సమస్యే ఉండదు

అవిసె గింజలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?

Flax Seeds  : అవిసె గింజలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? చాలా మందికి అవిసె గింజలు గురించి పెద్దగా తెలియదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. అవిసె గింజల్లో(Flax Seeds) నీటిలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అందువల్ల ఇవి తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఎవరైన బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.

అవిసె గింజ‌ల్లో(Flax Seeds) ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండడం వల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకునే వారిలో గుండె నొప్పి వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. వీటిని ప్రతి రోజు ఉదయం తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో అవిసె గింజ‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.

అవిసె గింజ‌ల్లో(Flax Seeds) ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమ్యసలు ఉండవు. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి. మహిళల్లో హార్మోన్ల‌ హెచ్చు తగ్గుల కారణంగా అనేక సమస్యలు వస్తాయి. అవిసె గింజలు తినడం వల్ల హార్మోన్ల‌ను సమతుల్యం చేస్తాయి.

Also Read : జామకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

 

No comment allowed please