#PachiPulusu : తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు

తెలంగాణాలో పచ్చి పులుసు ఎక్కువుగా తయారు చేసుకుంటారు.

Pachi Pulusu : తెలంగాణాలో పచ్చి పులుసు ఎక్కువుగా తయారు చేసుకుంటారు. ఏ కూర ఉన్నా కూడా ఇది చేసుకోవాల్సిందే. దీనిని తక్కువ పదార్ధాలతో కేవలం 10 నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
చింతపండు – కొద్దిగా
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – కొద్దిగా
నీళ్లు – 1 1/2 కప్పులు
ఉప్పు – రుచికి తగినంత
వెల్లుల్లి రెబ్బలు – 3
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిర్చి – 2
ఆవాలు – 1/2 స్పూన్
జీలకర్ర – 1/2 స్పూన్
ఇంగువ – చిటికెడు
నూనె – 2 టేబుల్ స్పూన్స్

తయారుచేయు విధానం :

ముందుగా నానబెట్టిన చింతపండు నుండి పిండి రసం తీయాలి. తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసి చింత పండు రసంలో కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఇదే తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు రెడీ అయినట్లే. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుటుంది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి.

Also Read : కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ

No comment allowed please