#SoumyaSwaminathan : ఆస్ట్రాజెన్ కా పై ఆందోళ‌న వ‌ద్దు – సౌమ్యా

ఏ మందు, వ్యాక్సిన్ సుర‌క్షితం కాదు

Soumya Swaminathan : ఆక్స్ ఫ‌ర్డ్, ఆస్ట్రాజెన్ కా త‌యారు చేస్తున్న కోవిడ్ టీకాపై ప్ర‌పంచ వ్యాప్తంగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మందుల‌ను చాలా వ‌ర‌కు యూర‌ప్ కంట్రీస్ నిషేధం విధించాయి. ఆ టీకాను వేసుకోవ‌డంలేద‌ని, ఇప్ప‌టికే కొన్ని దేశాలు స్ప‌ష్టం చేశాయి.

ఆస్ట్రాజెన్ కా టీకా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం గడ్డ‌క‌డుతోంద‌ని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్(Soumya Swaminathan) ఓ సూచ‌న చేశారు.

ప్ర‌స్తుతం ఆస్ట్రాజెన్ కా టీకాను వాడుతూనే ఉండాల‌ని తెలిపారు. ఆస్ట్రాజెన్ కా టీకా వినియోగంపై పూర్తి స్థాయిలో స‌మీక్ష చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురి కావ‌ద్దంటూ ఆమె సూచించారు.

టీకా వినియోగంపై ఇప్ప‌టికే ప‌లువురు సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నార‌ని వెల్ల‌డించారు.

స‌మీక్షించి నివేద‌క‌లు వ‌చ్చాక తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సౌమ్యా స్వామినాథ‌న్(Soumya Swaminathan) తెలిపారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అన్ని దేశాలు ఆస్ట్రాజెన్ కా టీకాను తీసుకోవ‌డం ఆపి వేయొద్దంటూ ఆమె సూచించారు.

ఆస్ట్రాజెన్ కాను ఇదివ‌ర‌కే తీసుకుని ఉన్న‌ట్ల‌యితే రెండో డోసు కంప‌ల్స‌రీగా తీసుకోవాల‌ని లేక‌పోతే దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని హెచ్చ‌రించారు సౌమ్యా స్వామినాథ‌న్.

అందుకేనే ఆ టీకాను త‌ప్ప‌నిస‌రిగా తీసుకుంటూనే ఉండాల‌ని సూచించారు. ఏ వ్యాక్సిన్ అయినా లేక మందు అయినా వంద శాతం సుర‌క్షితంగా ఉండ‌వ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ల‌క్ష‌ల్లో ఎవ‌రో ఒక‌రికి ఏదో జ‌రుగుతుంద‌ని, అంత మాత్రాన దాని గురించి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు సౌమ్యా స్వామినాథ‌న్.

ఇదిలా ఉండగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌త్యేక బృందం ఆస్ట్రాజెన్ కా వినియోగంపై స‌మీక్ష జ‌రుప‌నుంది.

Also Read : మానసిక సమస్యల పై అవగాహన లేకే ప్రాణాలు బలి

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!