#COVID-19 : దేశంలో కొత్త‌గా 62 వేల క‌రోనా కేసులు

క‌రోనా ఎఫెక్ట్ తో ప‌లువురు మృతి

COVID-19 : దేశాన్ని క‌రోనా రెండో వేవ్ సునామీలా చుట్టేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ముందు జాగ్ర‌త్త‌గా సూచ‌న‌లు ఇస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ప‌లు రాష్ట్రాల‌లో ఆయా ప్ర‌భుత్వాలు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

తెలంగాణ‌లో ఇప్ప‌టికే విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థ‌ల‌ను మూసి వేసింది.

ఏప్రిల్ 30 దాకా క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. ఇక దేశం గురించి ఆలోచిస్తే..క‌రోనా (COVID-19)తీవ్రత మ‌రింత పెరిగింద‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది.

రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. శ‌నివారం ఒక్క రోజే 62 వేల మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

గ‌త 24 గంట‌ల‌లో 62 వేల 714 మందికి క‌రోనా సోకింది.

దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య ఒక కోటి 19 ల‌క్ష‌ల 71 వేల 624కు చేరింది.

ఇందులో ఒక కోటి 13 ల‌క్ష‌ల 23 వేల 762 మంది బాధితులు క‌రోనా వైర‌స్(COVID-19) బారి నుంచి బ‌య‌ట ప‌డ్డారు.

ఇందులో ఏకంగా ల‌క్షా 61 వేల 552 మంది మృత్యువాత ప‌డ్డారు. క‌రోనా బాధితుల‌తో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం 4 ల‌క్ష‌ల 86 వేల 310 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

శ‌నివారం ఒక్క రోజే 312 మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. కొత్త‌గా 28 వేల 739 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

నిన్న‌టి వ‌ర‌కు 6 కోట్ల 2 ల‌క్ష‌ల 69 వేల 782 మంది క‌రోనా టీకా వేయించు కున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌, మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా 11 ల‌క్ష‌ల 81 వేల 289 మందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.

Also Read : రోగి జన్యు నిర్మాణ వైవిధ్యతతోనే ఔషధ ప్రభావం…!

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!