#Nilofer : చిన్నారుల‌కు తల్లి పాలే మందు 

తల్లికి పాజిటివ్ వ‌చ్చినా బిడ్డ‌కు ఏం కాదు

Nilofer  : చంటి పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌వ‌చ్చా అన్న‌ది చాలా మంది త‌ల్లుల్లో ఇవాళ సందేహం నెల‌కొంది. ముఖ్యంగా క‌రోనా సోకిన త‌ల్లుల ప‌రిస్థితి ఏమిటి అనే దానిపై నేష‌న‌ల్ నియోనాటల్ ఫోరం (Nilofer )తెలంగాణ చాప్ట‌ర్ స‌మావేశం నిర్వ‌హించింది.

మ‌హిళ‌ల సందేహాల‌కు స‌మాధానం ఇచ్చారు నిపుణులు, వైద్యులు. 12 ఏళ్ల లోపు పిల్ల‌ల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు. వాళ్ల‌కు పొంచి ఉన్న ముప్పు త‌క్కువేన‌న్నారు.

జూమ్ మీటింగ్ లో దీనిపై ప్ర‌త్యేకంగా  చ‌ర్చ చేప‌ట్టారు. చిన్నారుల‌పై పెద్దగా క‌రోనా ప్ర‌భావం చూపించ‌ద‌న్నారు నీలోఫ‌ర్ నోడ‌ల్ ఆఫీస‌ర్ ర‌మేశ్. ప‌లువురు డాక్ట‌ర్లు ఇందులో పాల్గొన్నారు.

త‌ల్లి పాలు తాగిన పిల్ల‌ల‌కు క‌రోనా వైర‌స్ సోక‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌ల్లికి పాజిటివ్ వ‌చ్చినా  పిల్ల‌ల‌కు నిర‌భ్యంత‌రంగా పాలు ప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు. పుట్టిన వెంట‌నే పాలు ప‌ట్టాల‌ని సూచించారు.

ఒక వేళ క‌రోనా వ‌ల్ల త‌ల్లి ద‌వ‌ఖానాలో ఉంటే పాలు పిండి పిల్ల‌ల‌కు ఇవ్వాల‌న్నారు. క‌రోనా సోకిన శిశువుల‌కు కానీ, పిల్ల‌ల‌కు కానీ ప్ర‌త్యేక చికిత్స లేద‌న్నారు.

శిశువుల‌కు త‌ల్లిపాలే అతి పెద్ద మందుగా పేర్కొన్నారు నిపుణులు. త‌ల్లి పాల‌లో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు.

పాలిచ్చే త‌ల్లులు టీకాలు తీసుకోవ‌చ్చ‌ని, కానీ క‌డుపుతో ఉన్న వారు మాత్రం తీసుకోకూడ‌ద‌ని సూచించారు.

80 శాతానికి పైగా శిశువుల్లో గానీ 12 ఏళ్ల లోపు పిల్ల‌ల్లో కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు అంత‌గా ఉండ‌వ‌న్నారు.

పాజిటివ్ వ‌చ్చిన త‌ల్లి వ‌ద్ద బిడ్డ‌ను ఉంచ వ‌చ్చ‌ని, కానీ నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూనే ఉండాలని సూచించారు.

పాజిటివ్ వ‌చ్చిన త‌ల్లులు ప్ర‌త్యేకించి తాజా కూర‌గాయ‌లు, పౌష్టికాహారం, పండ్లు తీసుకోవాల‌న్నారు.

Also Read : పీరియ‌డ్స్ టైంలో వ్యాక్సిన్ ఓకే – కేంద్రం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!