#LemonGross : లెమ‌న్ గ్రాస్ ఆరోగ్య ప్ర‌దాయ‌ని

ఎన్నో ఉప‌యోగాలు

Lemon Gross  : లెమ‌న్ గ్రాస్ అనేది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇది వేడి ప్ర‌దేశాల్లో పెరుగుతుంది. ఆగ్నేయ ఆసియాకు చెందిన గ‌డ్డి మొక్క‌. భార‌త్ తో పాటు చాలా దేశాల్లో మందుల త‌యారీలో దీన్ని విరివిగా వాడుతున్నారు.

దీని ద్వారా ఆయిల్ త‌యారు చేస్తారు. ఒక ఎక‌రాలో దీనిని సాగు చేస్తే కేవ‌లం రూ.30 వేలు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతాయి.

దీని ఆకులు, కాండాల్లో సిట్ర‌ల్, జెరానియ‌ల్ , క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి.

వీటిని తాజాగా అంటే అప్ప‌టిక‌ప్పుడే వాడ‌వ‌చ్చు. లేదా ఎండ బెట్టి అయినా ఉప‌యోగించవ‌చ్చు.

దీనిని పౌడ‌ర్ రూపంలోకి మార్చి కూడా వాడొచ్చు. ఐతే చాలా మంది లెమ‌న్ గ్రాస్ నే ఎక్కువ‌గా వాడ‌డం అల‌వాటుగా మారింది.

లెమ‌న్ గ్రాస్ (Lemon Gross )రంగులోనే కాదు కాంతి వంతంగా ప్ర‌కాశిస్తుంది. సుమధుర‌మైన సువాస‌న వ‌స్తుంది.

ఒకవేళ లెమ‌న్ గ్రాస్ ఎండి పోతే చెక్క ముక్క‌ల వాస‌న వ‌స్తుంది. ఆరోగ్య ప‌రంగా చూస్తే లెమ‌న్ గ్రాస్ త‌ల్లి, ఉల్లి కంటే ఎక్కువ‌గా మేలు చేస్తుంది.

జీర్ణ క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. ర‌సాన్ని తాగితే గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లతో పాటు వికారం వ‌దిలి పోతుంది.

ఇది ముస‌లిత‌నం రాకుండా చేస్తుంది. గుండె నొప్పి రాకుండా చేస్తుంది.

బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను బ‌య‌ట‌కు పంపేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. లెమ‌న్ గ్రాస్ ను జ్యూస్ ల‌లో క‌లిపి తీసుకుంటే అధిక బ‌రువు త‌గ్గుతుంది. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా చేస్తుంది.

వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీనిని పొందాలంటే షాప్స్ ల‌లో కాకుండా ఆన్ లైన్ లో ఈ కామ‌ర్స్ సైట్ల‌లో ఇది పొడి రూపంలో ల‌భిస్తుంది. దీని రుచి గురించి చెప్పాలంటే కొద్దిగా నిమ్మ‌కాయ ,

కొద్దిగా అల్లం వాస‌న క‌లిగి ఉంటుంది. తాజా లెమ‌న్ గ్రాస్ అయితే పుదీనా వాస‌న వ‌స్తుంది .

Also Read : అవిసె గింజలు తింటే క్యాన్సర్ సమస్యే ఉండదు

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!