#Modi : ప్ర‌పంచం ప్ర‌భుపాదం – న‌రేంద్ర మోదీ

ఆయ‌న నిజ‌మైన దేశ భ‌క్తుడు

Modi : ప్ర‌పంచం ఆయ‌న బోధ‌న‌ల‌కు త‌ల వంచుతోంది. జీవితమంతా భ‌క్తిని కోట్లాది ప్ర‌జల్లో ప్ర‌వ‌హించేలా చేసిన గొప్ప వ్య‌క్తి వేదాంత స్వామి ప్ర‌భుపాద అంటూ కీర్తించారు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Modi).

125వ జ‌యంతి సంద‌ర్భంగా రూ. 125 ప్ర‌త్యేక నాణేన్నా మోదీ విడుద‌ల చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వేడుక‌లు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాని ప్ర‌సంగించారు. సాధ‌నతో సంతోషం అల‌వ‌డుతుంది. ఆ అనుభూతిని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం.

దానిని ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల మంది శ్రీ‌కృష్ణ‌డి భ‌క్తులు, ప్ర‌భుపాద స్వామి భ‌క్తులు అనుభ‌విస్తున్నార‌ని మోదీ (Modi)అన్నారు.

ప్ర‌భు పాద స్వామి అతీంద్రియ శ‌క్తులు క‌లిగిన భ‌క్తుడు కాద‌ని , ఆయ‌న నిజ‌మైన భార‌త దేశ భ‌క్తుడ‌ని ప్ర‌శంసించారు.

భార‌త స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స‌హాయ నిరాక‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా నిలిచాడ‌ని చెప్పారు.

స్కాటిష్ కాలేజీ నుంచి డిప్లొమా తీసుకునేందుకు నిరాక‌రించిన గొప్ప డివోటీగా పేర్కొన్నారు.

ఆయ‌న ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన ఇస్కాన్ ఇవాళ కోట్లాది మంది ప్ర‌జ‌లకు దారి చూపే దిక్సూచిగా మారింద‌న్నారు ప్ర‌ధాని.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇస్తాన్ దేవాల‌యాలు ఉన్నాయ‌ని, గురుకులాలు భార‌తీయ సంస్కృతిని స‌జీవంగా ఉంచుతున్నాయ‌ని చెప్పారు మోదీ.

ఈ దేశానికి విశ్వాసం అంటే ఉత్సాహం, ఉల్లాసం, మాన‌వత్వం పై మ‌మ‌కారం అని ఇస్కాన్ ఈ లోకానికి చాటి చెప్పింద‌న్నారు. ఇస్కాన్ ద్వారా భ‌క్తి ఉద్య‌మాన్ని తీసుకు వెళ్లార‌ని, గీత వంటి వైదిక సాహిత్యాన్ని ప్ర‌చారం చేశార‌న్నారు.

ఇస్కాన్ భ‌క్తిని పెంపొందించ‌డ‌మే కాదు భ‌క్తి క‌లిగి ఉండేలా చేస్తోంద‌ని కీర్తించారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : ఆల‌యాల అభివృద్ధికి సీఎం కృషి – హ‌రీష్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!