#Telstra : హైద‌రాబాద్ లో టెల్ స్ట్రా సెంట‌ర్ ప్రారంభం

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేంద్రాలు సోపానం

Telstra : హైద‌రాబాద్ లో మ‌రో దిగ్గ‌జ కంపెనీ త‌న సెంట‌ర్ ను ప్రారంభించింది. ఇప్ప‌టికే అమెజాన్, గూగుల్, త‌దిత‌ర కంపెనీలు ఇక్క‌డ ఆర్ అండ్ డీ సెంట‌ర్ల‌ను స్టార్ట్ చేశాయి.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన టెలీ క‌మ్యూనికేష‌న్స్ అండ్ టెక్నాల‌జీ కంపెనీ టెల్ స్ట్రా(Telstra) ర‌హేజా మైండ్ స్పేస్ లో ఇన్నోవేష‌న్ అండ్ క్యాప‌బిలిటీస్ సెంట‌ర్ – ఐసీసీని ప్రారంభించింది.

43 వేల 372 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీకి ఇప్ప‌టికే పుణెలో కూడా ఐసీసీ ఉంది.

బెంగ‌ళూరులో నెట్ వ‌ర్క్ అండ్ ప్రోడ‌క్ట్ ఇంజ‌నీరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది.

ఒక ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు సెంట‌ర్స్ ఫ్యూచ‌ర్ లో ఇన్నోవేష‌న్ సెంట‌ర్స్ గా మార‌నున్నాయి.

దేశంలో ప్ర‌తిభా సామ‌ర్థ్యాల‌ను గుర్తించి ప్రోత్స‌హించేందుకు ఇవి దోహ‌దం చేస్తాయి.

డిజిట‌ల్ సేవ‌లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ విష‌యాన్ని టెల్ స్ట్రా ఇండియా ఎండీ అండ్ కంట్రీ హెడ్ ఎన్.టి.అరుణ్ కుమార్ వెల్ల‌డించారు.

హైద‌రాబాద్, పూణేల్లో తాము నూత‌నంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేష‌న్ అండ్ క్యాపెబిలిటీస్ సెంట‌ర్లు త‌మ ఇన్నోవేటివ్ సామ‌ర్థ్యాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాయ‌న్నారు.

ఈ రెండు కేంద్రాల‌కు స‌బ్ ఏరియాల్లో ఉన్న స్పెష‌లైజింగ్ కేంద్రాలు కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మూలమ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు అరుణ్ కుమార్.

టెల్ స్ట్రా ఐసీసీల్లో ప‌ని చేయ‌డం ద్వారా సాంకేతిక నిపుణులు ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ ,

5జీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ స‌హా ఇత‌ర సాంకేతిక ప‌రంగా వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను సులువుగా ప‌రిష్క‌రించ గ‌ల‌ద‌ని వెల్ల‌డించారు.

Also Read : ఎంప్లాయిస్ కు గూగుల్ గుడ్ న్యూస్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!