#Airtel : క్లౌడ్ గేమింగ్ సెష‌న్ స‌క్సెస్

ఎయిర్ టెల్ ప్ర‌యోగం విజ‌య‌వంతం

Airtel : టెక్నాల‌జీ ప‌రంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్ , ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబ‌ర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త పోక‌డ‌లు పోతోంది.

ముఖ్యంగా ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీలో ఇవే కీల‌కం కాబోతున్నాయి రాబోయే కాలంలో. భ‌విష్య‌త్తులో ఎలాంటి కేబుల్స్ లేకుండానే ఇంట‌ర్నెట్ పొందే అవ‌కాశం త్వ‌ర‌లోనే రాబోతోంది.

దీనికి టెస్లా ప్లాన్ చేస్తోంది. అదే గ‌నుక వ‌స్తే ఇక యూజ‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు.

4జీ క‌నెక్టెవిటీ క‌లిగిన వారికి 5జీ అనుభ‌వం మ‌రింత కొత్త‌గా అగిపించేలా చేస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో టెలికాం రంగాన్ని రిల‌య‌న్స్ జియో శాసిస్తోంది.

అదే బిగ్ టెలికాం ఆప‌రేట‌ర్ గా అవ‌త‌రించింది. ఇది కొట్టిన దెబ్బ‌కు మిగ‌తా టెలికాం ఆప‌రేట‌ర్ కంపెనీల‌న్నీ నేల చూపులు చూస్తున్నాయి.

ఒక్క భార‌తీ ఎయిర్ టెల్(Airtel) ఒక్క‌టే కాస్తా త‌ట్టుకొని నిల‌బ‌డింది.

రిల‌య‌న్స్ జియో కంటే ముందే ఎయిర్ టెల్(Airtel) ప్ర‌యోగాత్మ‌కంగా 5జీని ప్ర‌యోగించింది. దీనిని హైద‌రాబాద్ కేంద్రంగా టెస్టింగ్ చేసింది. తాజాగా ఈ టెలికాం దిగ్గ‌జం మ‌రో రికార్డు సాధించింది.

5జీ టెక్నాల‌జీ సాయంతో మొట్ట మొద‌ట‌గా క్లౌడ్ గేమింగ్ సెష‌న్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు ఎయిర్ టెల్ కంపెనీ ప్ర‌క‌టించింది.

వ‌చ్ఏ ఏడాది ప్రారంభం నుంచే 5జీని ప్రారంభిస్తామ‌ని ఆ సంస్థ సిటీఓ వెల్ల‌డించారు.

ఇండియాలో యూత్ ఎక్కువ‌. వారంతా ఎదురు చూస్తున్నారు. ఎక్కువ‌గా గేమింగ్ పైనే ఫోక‌స్ పెడుతున్న‌ట్లు చెప్పారు. రూ. 2.4 బిలియ‌న్ మార్కెట్ గా ఉంద‌న్నారు.

Also Read : నెట్టింట్లో కూ కోసం క్యూ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!