#Mako : కోట్లను కాద‌నుకున్న ప్రేమ

సామాన్యుడి తోనే రాజ‌కుమారి పెళ్లి

Mako  : ఇది క‌థ కాదు నిజం. చెంత‌లో కోట్లాది రూపాయ‌లు ఉన్నా. త‌ర త‌రాల‌కు స‌రిప‌డా సిరి సంప‌ద‌లున్నా వాట‌న్నింట‌నీ ఆమె వ‌దులుకుంది. కేవ‌లం త‌ను ప్రేమించిన వాడి కోసం. మ‌న‌మైతే సినిమాల్లో చూస్తాం. కానీ అది వాస్త‌వ రూపం దాల్చితే ఎలా ఉంటుంది క‌దూ.

అదే ప్రేమ‌కున్న గొప్ప‌త‌నం. ప్రేమంటే రెండు మ‌న‌సుల క‌ల‌యిక‌.

క‌ల్మ‌షం లేని అనుబంధం. ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే అని క‌వి రాసిన‌ట్లు ఈ రాజ‌కుమారి ఏకంగా ఏమీ లేని సామాన్యుడిని ప్రేమించింది.

త‌ను లేకుండా ఉండ‌లేనంటోంది. ఏకంగా త‌న‌కు వార‌స‌త్వంగా ద‌క్కిన రాజ‌కుమారి హోదాను సైతం త్యాగం చేసేందుకు సిద్ధ‌ప‌డింది. ఆమె ఎవ‌రో కాదు జ‌పాన్ కు చెందిన రాజ‌కుమారి మ‌కో(Mako ).

ఆమె సాహసోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. సంప్ర‌దాయం ప్ర‌కారం ఎవ‌రైనా సామాన్యుడిని గ‌నుక పెళ్లి చేసుకుంటే ఆమెకు రాచ కుటుంబం డ‌బ్బులు ఇస్తుంది.

మ‌కోకు కూడా 1.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

అంటే మ‌న భార‌తీయ రూపాయ‌ల్లో రూ. 8. 77 కోట్లు. కానీ అవేవీ త‌న‌కు వ‌ద్దంటూ బ‌దులిచ్చింది.

తాను కోరుకున్న‌..త‌న‌ను ప్రాణ ప్రాదంగా ప్రేమించిన ప్రేమికుడుతోనే ఉండేందుకు నిర్ణ‌యించుకుంది మ‌కో(Mako ).

అత‌డినే పెళ్లి చేసుకోవాల‌ని ఆశించిన ఆమెకు 29 ఏళ్లు. ఎట్ట‌కేల‌కు మ‌కోకు కుటుంబ స‌భ్యుల నుంచి కూడా అడ్డంకులు పూర్తిగా తొలిగి పోయాయి.

వారంద‌రి అనుమ‌తితో మ‌కో తాను ఇష్ట ప‌డిన వ్య‌క్తిని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనుంది.

ఆ అదృష్ట‌వంతుడైన ప్రేమికుడు అమెరికాలో ప్ర‌స్తుతం లా చ‌దువుతున్నాడు. సో ..యే జింద‌గీ క‌భీ క‌భీ అజ్ న‌భీసి ల‌గ్ తీ హై అంటూ గాన గంధ‌ర్వుడు బాలసుబ్ర‌మ‌ణ్యం..ఆల్కాయాజ్ఙిక్ పాడిన పాట నిజం అనిపిస్తోంది.

Also Read : భార‌త్ సాయం మ‌రువ‌లేం – అర్యానా

No comment allowed please