#TSGovt : అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ రిలీజ్

ఇయ‌ర్ లో ఇక 213 ప‌ని దినాలు

TS Govt  : తెలంగాణ విద్యా శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఈనెల 1 నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభం అయ్యాయి. ఈ త‌రుణంలో అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ ను ఇవాళ విడుద‌ల చేసింది.

ఇందులో భాగంగా 213 రోజులు ప‌ని దినాలు ఉండ‌గా ఇందులో 166 రోజుల పాటు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌నున్నాయి.

మిగ‌తా 47 రోజుల్లో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిన క్లాసులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఇక ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు 2022 జ‌న‌వ‌రి 10వ తేదీ నాటికి సిల‌బ‌స్ పూర్తి చేయాల‌ని విద్యా శాఖ (TS Govt )స్ప‌ష్టం చేసింది.

ఇక ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఏప్రిల్ నెల‌లో టెన్త్ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. పాఠ‌శాలల చివ‌రి వ‌ర్కింగ్ డే ఏప్రిల్ 23గా ప్ర‌క‌టించింది తెలంగాణ విద్యా శాఖ‌(TS Govt ).

ఇక ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఇక అకాడ‌మిక్ క్యాలండ‌ర్ లో ఆయా పండుగ‌ల‌కు సంబంధించి సెల‌వులు కూడా వెల్ల‌డించింది. ఇందులో ద‌స‌రా సెలవులు ఈసారి మూడు రోజులు త‌గ్గించింది.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 6 నుంచి 17 దాకా అంటే 12 రోజుల పాటు ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

క్రిస్మ‌స్ సెల‌వులు ఏడు రోజులు ఇస్తున్న‌ట్లు తెలిపింది. డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఇక వేస‌వి సెల‌వులు 2022 ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 దాకా కేటాయించిన‌ట్లు విద్యా శాఖ స్ప‌ష్టం చేసింది.

మ‌రో వైపు క‌రోనా ఇంకా పూర్తి కాలేద‌ని స్కూళ్లు ఎలా తెరుస్తారంటూ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది. ఈనెల 6 వ‌ర‌కు విచార‌ణ వాయిదా వేసింది కోర్టు.

Also Read : ప్ర‌తి ఒక్క‌రు బ‌డికి రావాల్సిందే

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!