#Modi : యాదాద్రికి రానున్న మోదీ

ఆహ్వానించిన సీఎం కేసీఆర్

Modi : న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో రూపు దిద్దుకుంటున్న ఆధ్యాత్మిక న‌గ‌రిగా అవ‌త‌రిస్తున్న యాదాద్రి ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి దేవాల‌య పునః ప్రారంభోత్స‌వానికి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (Modi )రానున్నారు.

ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానం ప‌లికారు. సీఎం కోరిక‌ను మ‌న్నించి వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు ప్ర‌ధాని.

ఈసంద‌ర్భంగా ఢిల్లీలో పీఎంతో భేటీ సంద‌ర్బంగా మోదీకి శాలువా క‌ప్పారు.

గంట పాటు పీఎం, సీఎంల మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. ప‌లు ప్ర‌ధాన అంశాలపై మాట్లాడారు.

ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివ‌రించారు. పూర్తి ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన సీఎం కేసీఆర్ భారీ ఎత్తున నిధులు కేటాయించారు

యాదాద్రి ఆల‌య అభివృద్ధి కోసం. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు ధీటుగా దీనిని రూపొందించాల‌ని ఆయ‌న క‌ల‌.

దానిని ఆర్కిటెక్చ‌ర్ ఆనంద్ సాయి ఆధ్వ‌ర్యంలో దీనిని పునః నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త , ఆధునిక గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాదాద్రి రూపుదిద్దుకుంటోంది.

ప్ర‌ధాన‌మంత్రి మోదీతో దీనిని పునః ప్రారంభించాల‌ని సీఎం కోర‌డం..వెంట‌నే పీఎం ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగింది.

ఇక పార్టీ ప‌రంగా ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం కోసం భూమి పూజ కూడా చేశారు.

ప‌నిలో ప‌నిగా వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ది విన‌తి ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు ప్ర‌ధాన‌మంత్రికి.

కీల‌క అంశాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు సీఎం కేసీఆర్. మొత్తంగా సీఎం ఢిల్లీ టూర్ ఫ‌ల‌ప్ర‌దంగా ..ఆనంద దాయ‌కంగా సాగింది.

Also Read : ప్ర‌మాదంలో తెలుగు భాష – సీజేఐ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!