#Kanipakam : కాణిపాకంకు పోటెత్తిన భ‌క్తులు

మంత్రి పెద్దిరెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు

Kanipakam : తెలుగు రాష్ట్రాల‌లో వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఏపీలో పేరొందిన కాణిపాకం వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి(Kanipakam) మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్. బాబు, ఆల‌య పూజారులు, ఈఓ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేద పండితులు ఆశీర్వ‌దించి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

కాణిపాకం వినాయ‌క ఆల‌యంలో క‌రోనా రూల్స్ పాటిస్తూ స్వామి వారిని భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు.

భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ఆల‌య అధికారులు ప్ర‌త్యేక లైన్లు ఏర్పాటు చేశారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. చిత్తూరుకు 11 కిలోమీట‌ర్లు, తిరుప‌తి నుంచి 68 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది కాణిపాకం. ఈ స్థ‌లం మ‌హిమాన్వితంగా పేరొందింది.

దీన్ని కాణిప‌ర‌కం (Kanipakam)అని మొద‌ట్లో త‌మిళ ప‌దంతో పిలిచే వారు. రాను రాను కాణిపాకంగా మారి పోయింది.

ఈ రోజు వ‌ర‌కు కూడా వినాయ‌కుడి విగ్ర‌హం నూతిలోనే ఉంటుంది.

అక్క‌డి ప్రాంగ‌ణంలోనే ఓ బావి కూడా ఉంది. దానిలోనే స్వామి వారి వాహ‌నంగా ఉప‌యోగించే ఎలుక కూడా కొలువు తీరి ఉంది.

ఈ దేవాల‌యాన్ని 11వ శతాబ్ద కాలంలో చోళ రాజు మొద‌టి కుళుత్తుంగా చోశుడు నిర్మించాడు.

1336లో విజ‌య‌న‌గ‌ర సంస్థాన చ‌క్ర‌వ‌ర్తులు కాణిపాకం ఆల‌యాన్ని అభివృద్ధి చేశారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా పండుగ నాటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా త‌క్కువ సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తున్నారు.

Also Read : కేసీఆర్ ఆధ్యాత్మిక‌త‌కు అంబాసిడ‌ర్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!