#OsmaniaUniversity : ఉస్మానియాకు 32వ ర్యాంకు

హైద‌రాబాద్ ఐఐటీకి 8వ స్థానం

Osmania University : దేశంలోని ఉత్త‌మ విద్యా సంస్థ‌ల‌లో ఉస్మానియా యూనివ‌ర్శిటీకి 32వ ర్యాంకు సాధించింది. దేశంలోని ఐఐటీలలో ఎప్ప‌టి లాగే మద్రాస్ ఐఐటీ నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్(Osmania University ) తాజాగా ర్యాంకులు ప్ర‌క‌టించింది.

టాప్ -10 విద్యా సంస్థ‌ల్లో ఏడు ఐఐటీలే ఉండ‌డం విశేషం. రీసెర్చ్ సెక్టార్ లో బెంగ‌ళూరు ఐఐఎస్ సీ టాప్ లో నిలిచింది.

ఢిల్లీలోని జేఎన్ యూ రెండో అత్యుత్త‌మ వ‌ర్శిటీ నిలిచింది.

ఇంజ‌నీరింగ్ సంస్థ‌ల కేట‌గిరీలో టాప్ 10లో 8 ఐఐటీలు క‌లిగి ఉన్నాయి.

బీజినెస్ స్కూళ్ల‌లో ఐఐఎం అహ్మ‌దాబాద్ టాప్ నిలువ‌గా మెడిక‌ల్ కాలేజీల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ కాలేజీ టాప్ లో ఉన్నాయి.

ఇక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ యూనివ‌ర్శిటీల విభాగంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీ చోటు ద‌క్కింది.

ఇక ఓవ‌రాల్ ర్యాంకింగ్ లో 62వ స్థానంలో నిలిచింది. ఐఐటీ హైద‌రాబాద్ ఓవ‌రాల్ ర్యాంకింగ్ లో 16వ ప్లేస్ లో నిలిచింది.

ఇంజ‌నీరింగ్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్ వ‌ర్సిటీల ర్యాంకింగ్ లో తొమ్మిది స్థానంలో నిలిచింది.

ఓవ‌రాల్ గా 17వ ర్యాంకు సాధించింది.

న్యాయ విద్యా విభాగం ప‌రంగా చూస్తే టాప్ 30 కాలేజీల్లో హైద‌రాబాద్ కు చెందిన రెండు విద్యా సంస్థ‌ల‌కు (Osmania University )చోటు ద‌క్క‌డం విశేషం.

ఇందులో న‌ల్సార్ యూనివ‌ర్శిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంకు ల‌భించింది.

ఇక్ఫాయ్ ఫౌండేష‌న్ ఫ‌ర్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ కు 29వ ర్యాంకు సాధించింది.

ఇంజ‌నీరింగ్ విభాగంలో హైద‌రాబాద్ లో 9 ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు టాప్ 200లో చోటు ద‌క్కడం విశేషం.

Also Read : ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ కు రాజ్యంగ బోధ‌న

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!