#RBI : ఖాతాదారుల‌కు ఆర్బీఐ తీపి క‌బురు

ప‌ర్మిష‌న్ లేకుండా డ‌బ్బులు క‌ట్ కావు

RBI  : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా ఖాతాదారుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఇప్ప‌టికే ఆయా బ్యాంకులు నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉండ‌డంతో ఈ మ‌ధ్య క‌స్ట‌మ‌ర్ల శ్రేయ‌స్సు కోసం ఆర్బీఐ (RBI ) కృషి చేస్తోంది.

ఇందులో భాగంగా గ‌త కొంత కాలంగా టెక్నాల‌జీ పెర‌గ‌డంతో చాలా మంది అకౌంట్ క‌లిగిన వారంతా ఇంటి నుంచే ఫోన్ ద్వారా త‌మ లావాదేవీలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఓ ర‌కంగా ఇప్పుడంతా డిజిట‌లైజేష‌న్ జ‌పం న‌డుస్తోంది.

ఇంకా గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డ‌లేదు. అయితే మోదీ ప్ర‌భుత్వం మాత్రం దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు న‌గ‌దు రహిత వ్య‌వ‌హారాలు, లావాదేవీలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఆ మేర‌కు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు సైతం ఇప్పుడు డిజిట‌ల్ జ‌పం చేస్తున్నాయి.

ఈ త‌రుణంలో నిత్యావ‌స‌రాల నుంచి ప్ర‌తి వ‌స్తువును ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు.

దీంతో ఆయా కంపెనీలు, బ్యాంకులు ముంద‌స్తుగానే ఖాతాదారుల నుంచి నెలా నెలా డ‌బ్బులు క‌ట్ చేసుకుంటున్నాయి.

దీనిని గ‌మ‌నించిన ఖాతాదారులు పెద్ద ఎత్తున రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక నుంచి అకౌంట్ హోల్డ‌ర్ల నుంచి అద‌న‌పు ధృవీక‌ర‌ణ త‌ర్వాతే డ‌బ్బులు కట్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇందు కోసం ఖాతాదారులు రిజిస్ట్రేష‌న్ చేసు కోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది ఆర్బీఐ(RBI ).

మొద‌టి ద‌శ‌లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ విష‌యంలో ఈ నిబంధ‌ల్ని వ‌ర్తింప చేయ‌నుంది.

ఇక నుంచి యూజ‌ర్ ప్ర‌మేయం లేకుండా నెల నెలా ఆటోమేటిగా అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్ కావ‌డం అంటూ ఉండ‌ద‌ని ఆర్బీఐ(RBI )తెలిపింది.

ఈ మేర‌కు అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Also Read : ఐటీలో హైద‌రాబాద్ అదుర్స్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!