#Farmers : రుణాల చెల్లింపులో రైతులు బెట‌ర్

త‌క్కువ రుణాలలో త‌మిళ‌నాడు టాప్

Farmers : తెలంగాణ ఇప్పుడు ధాన్యాగారంగా మారుతోంది. ఊహించ‌ని రీతిలో సాగు విస్తీర్ణం పెరిగింది. పుష్క‌లంగా నీళ్లు రావ‌డంతో ఇది సాధ్య‌మైంది. ఇక రుణాలు తీసుకోవ‌డంలో తెలంగాణ‌కు చెందిన రైతులు అతి త‌క్కువ‌గా తీసుకుని భారీ ఎత్తున సాగు చేస్తుండ‌డం విశేషం.

తాజాగా దేశంలో అత్యంత త‌క్కువ పెట్టుబ‌డితో సాగు చేస్తున్న రాష్ట్రాల‌లో తెలంగాణ (Farmers)ఐదో ప్లేస్ లో నిలిచింది.

మొద‌టి స్థానంలో ఏపీ ఉండ‌గా రెండో ప్లేస్ లో కేర‌ళ‌, మూడో స్థానంలో పంజాబ్ , నాలుగో స్థానంలో హ‌ర్యానా నిలిచింది.

ఏపీలో రైతులు స‌గ‌టున రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా రుణాలు తీసుకుంటున్నారు. కేర‌ళ‌ల‌లో రూ. 2. 42 ల‌క్ష‌లు, హ‌ర్యానాలో రూ. 1.82 ల‌క్ష‌ల రుణం తీసుకుంటుండ‌గా తెలంగాణ‌లో మాత్రం కేవ‌లం ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు మాత్రమే రైతులు రుణాలు (Farmers)తీసుకుంటున్నారు.

ఇక ఆరో స్థానంలో క‌ర్నాట‌క నిలిచింది. ఇక్క‌డ చాలా త‌క్కువ‌గా ల‌క్షా 26 వేల రూపాయ‌లు ఉండ‌డం విశేషం.

ఏడో ప్లేస్ లో నిలిచిన రాజ‌స్థాన్ లో రైతులు కేవ‌లం ల‌క్షా 13 వేల రూపాయ‌లే తీసుకుంటున్నారు.

చివ‌రి స్థానంలో ఊహించ‌ని రీతిలో త‌మిళ‌నాడు ఉండ‌డం ఆలోచించాల్సిన విష‌యం. ఆ రాష్ట్రానికి చెందిన రైతులు కేవ‌లం రూ. ల‌క్ష మాత్ర‌మే రుణంగా తీసుకుంటున్నారు.

కేంద్ర గ‌ణాంకాల శాఖ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డించింది. రుణాల‌ను స‌ద్వినియోగం చేసుకోవడంలోనే కాకుండా తిరిగి చెల్లించ‌డంలో సైతం రైతులు టాప్ లో ఉన్నారు.

ఇక తెలంగాణ‌లో గ‌త ఏడేళ్ల కాలంలో కొత్త‌గా 32 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా భూమి సాగులోకి రావ‌డం విశేషం. వ‌రి సాగులో టాప్ లో నిలిచింది. గ‌త ఏడాది 3 కోట్ల ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి అయింది. ఎఫ్ సీఐ తెలంగాణ నుంచే అధికంగా కొనుగోలు చేసింది.

Also Read : అగ్రి ఇన్నోవేష‌న్ హ‌బ్ స్టార్ట్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!