#VijayRoopani : రూపానీ గ్రాఫ్ ప‌డి పోయిందా

ఆర్ఎస్ఎస్ స‌ర్వేనే కార‌ణ‌మా

Vijay Roopani  : సుదీర్ఘ కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి పెట్ట‌ని కోట‌గా ఉంది రాజ‌స్తాన్ రాష్ట్రం. ఇక్క‌డి నుంచే న‌రేంద్ర మోదీ సీఎంగా ఎన్నిక‌య్యారు. అక్క‌డి నుంచి దేశానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు.

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి నుంచే బీజేపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

త్వ‌ర‌లో జ‌రిగే రాష్ట్రాల‌కు ప‌రిశీల‌కుల‌ను కూడా నియ‌మించింది. అయితే దేశ వ్యాప్తంగా త‌న ప‌రివారాన్ని ఇప్ప‌టి నుంచే అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌స్తోంది.

ఇక నుంచి వ‌రుస యాత్ర‌లు చేప‌ట్టాల‌ని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే మ‌రోసారి అయోధ్య నిర్మాణం, స‌ర్జిక‌ల్ స్ట్రైక్, ఆఫ్గ‌నిస్తాన్ త‌దిత‌ర అంశాల‌ను ముందుకు తెస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ త‌రుణంలో ఇప్ప‌టికే కోలుకోలేని షాక్ ఇచ్చింది క‌ర్నాట‌కలో బీజేపీ. అక్క‌డ ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండ‌ట‌మే కాదు

ద‌క్షిణాదిన కాషాయానికి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన సీఎం యెడియూర‌ప్పను కూడా ప‌క్క‌న పెట్టింది పార్టీ హైక‌మాండ్.

మోదీ త్ర‌యం అంటే మోదీ, న‌డ్డా, అమిత్ షా లు ఎప్పుడు ఎవ‌రికి చెక్ పెడ‌తారోన‌ని ఆ పార్టీలోని శ్రేణుల‌కు అంతు చిక్క‌కుండా ఉంది.

ఇదిలా ఉండ‌గా 2016లో సీఎంగా కొలువుతీరిన విజ‌య్ రూపానీ(Vijay Roopani )ఉన్న‌ట్టుండి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు మంత్రుల‌కు కూడా ఝ‌ల‌క్ ఇవ్వ‌నుంది పార్టీ.

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అంత‌ర్గ‌తంగా స‌ర్వే చేప‌ట్టింద‌ని ఇందులో రూపానీ గ్రాఫ్ ప‌డి పోయింద‌ని తేల్చింద‌ని స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో విప‌క్షాలు మేలుకొనే లోపే సీఎంను మార్చితే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి బీజేపీ వ‌చ్చేసింది.

అందుక‌నే ఉన్న‌ట్టుండి గుడ్ బై చెప్పేశాడు రూపానీ. ఇక్క‌డ 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.

రెండు రోజుల కింద‌ట షా గుజ‌రాత్ వెళ్లాడు. వెంట‌నే ఢిల్లీకి తిరిగి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత సీఎం ప‌ద‌వి ఊడింది.

మ‌రి ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డ‌ది. కేంద్ర మంత్రి మాండ‌వీయ లేక డిప్యూటీ సీఎంగా ఉన్న పాటిల్ ను ఎంపిక చేస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : యూపీలో ప్రియాంక దండ యాత్ర‌

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!