#RishadPremji : వ‌ర్క్ ఫ్రం హోంకు విప్రో గుడ్ బై

ఇక ఉద్యోగులు ఆఫీసుకు షురూ

Rishad Premji   :క‌రోనా కార‌ణంగా నిన్న‌టి దాకా వ‌ర్క్ ఫ్రం హోంకు అల‌వాటు ప‌డిన వారంతా మెల మెల్ల‌గా ఆఫీసుల‌కు ఎలా వెళ్లాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఎవ‌రి పెత్త‌నం లేకుండా ఎంచ‌క్కా ఇల్లే ఆఫీసుగా అనుకుని ఫుల్ ఎంజాయ్ చేసిన టెక్కీలు, ఇత‌ర ఉద్యోగుల‌కు కోలుకోలేని రీతిలో షాక్ లు ఇస్తున్నాయి దిగ్గ‌జ కంపెనీలు.

ఇప్ప‌టికే ఫేస్ బుక్, గూగుల్ , మైక్రో సాఫ్ట్ , తదిత‌ర కంపెనీల‌న్నీ ప‌లుసార్లు ఆఫీసుల‌కు రావాల‌ని కోరాయి.

కానీ వీరంతా ఉద్యోగాలైనా వ‌దులుకుంటాం కానీ ఆఫీసుల‌కు రాలేమంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వేచి చూసే ధోర‌ణి అవ‌లంభించాల‌ని నిర్ణ‌యించారు. ఇంకొన్ని కంపెనీలు ఆఫీసుల‌కు రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశాయి.

తాజాగా విప్రో వ‌ర్క్ ఫ్రం కు గుడ్ బై చెప్పింది. సోమ‌వారం నుంచి రావాలంటూ సూచించింది.

దీంతో స‌ద‌రు కంపెనీలో ప‌ని చేస్తున్న వారంతా హాజ‌రయ్యేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు.

వారంలో రెండు రోజులు మాత్ర‌మే కార్యాల‌యానికి వ‌స్తారు. ఉద్యోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది కంపెనీ.

క‌రోనా కార‌ణంగా గ‌త 18 నెల‌ల నుంచి ఇంటి వ‌ద్ద నుంచే ప‌ని చేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది.

పూర్తిగా టీకాలు తీసుకున్న వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది విప్రో. మా నాయ‌కులంతా విధుల్లో వ‌చ్చేందుకు రెడీ గా ఉన్నారు. వారంద‌రికీ స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని ఆ సంస్థ చైర్మ‌న్ రిష‌ద్ ప్రేమ్(Rishad Premji )జీ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

Also Read : నెట్టింట్లో కూ కోసం క్యూ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!