#KCR : 14న‌ యాదాద్రికి సీఎం కేసీఆర్

ఆల‌య నిర్మాణ ప‌నుల ప‌రిశీల‌న

KCR  : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రిలో ఈనెల 14న‌ ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మయ్యారు ఈఓ. ఈ టూర్ లో భాగంగా యాదాద్రి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నెల‌ల్లో యాదాద్రి పుణ్య క్షేత్రం పునః ప్రారంభోత్స‌వం ఉండ‌నుంది.

ఇటీవ‌ల సీఎం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. అక్క‌డ వారం రోజుల పాటు ఉన్నారు. హస్తిన‌లో తెలంగాణ భ‌వ‌న నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంత‌రం మ‌ర్యాద పూర్వ‌కంగా భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలోనే అత్యంత అత్యాధునికంగా

న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో యాదాద్రి ఆల‌యాన్ని పునః నిర్మిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ (KCR ) ప్ర‌ధానికి వివ‌రించారు.

అంతే కాకుండా మీ ఆధ్వ‌ర్యంలోనే ఈ ఆల‌యాన్ని పునః ప్రారంభోత్స‌వం జ‌ర‌గాల‌ని, హాజ‌రు కావాల‌ని ఆహ్వానం ప‌లికారు. దీంతో మోదీ స్వ‌యంగా హిందువు, భ‌క్తుడు కావ‌డంతో సీఎం కేసీఆర్ విన్న‌పాన్ని మ‌న్నించారు.

తాను త‌ప్ప‌క వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో ఇప్ప‌టి దాకా నిలిచి పోయిన ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతంగా చేయించాల‌నే ఉద్దేశంతో సీఎంKCR )యాదాద్రిని ప‌ర్య‌టించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా యాదాద్రి శ్రీ‌లక్ష్మీ న‌ర‌సింహ్మాస్వామి వారి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను సీఎంఓ ముఖ్య కార్య‌ద‌ర్శి భూపాల్ రెడ్డి ప‌రిశీలించారు.

ప్ర‌ధానాల‌యం లిఫ్టు, ర‌థ శాల‌, క్యూ లైన్లు , క్యూ కాంప్లెక్స్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. శ్రీ‌వారి మెట్లు, శివాల‌యం, ప్ర‌ధానాల‌యం తుది మెరుగులు దిద్దుతున్నారు.

Also Read : ప్ర‌పంచం ప్ర‌భుపాదం – న‌రేంద్ర మోదీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!