#Flipkart : భారీ ఆఫ‌ర్లు బంప‌ర్ సేల్స్

కొనుక్కోన్న‌ళ్లకు కొనుక్కున్నంత

Flipkart  : ఈ కామ‌ర్స్ బిజినెస్ ఇప్పుడు దిగ్గ‌జ కంపెనీల‌కు కాసులు కురిపిస్తున్నాయి. పండుగ‌లు, జాతీయ ప‌ర్వ‌దినాల‌ను పుర‌స్క‌రించుకొని బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నాయి.

తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా మ‌రో బిగ్ సేల్స్ ప్ర‌క‌టించ‌నుంది. బిలియ‌న్ డేస్ సేల్స్ అంటూ త‌న అధికారిక పోర్ట‌ల్ లో పేర్కొన‌డం ఇందుకు ఊత‌మిస్తోంది.

ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఈసారి కూడా అంత‌కంటే ఎక్కువగా డిస్కౌంట్స్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే గ‌త జూన్ నెల‌లో భారీగా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఊహించిన దాని కంటే కాసులు ఎక్కువ‌గా కొల్ల‌గొట్టింది ఫ్లిప్ కార్ట్(Flipkart ).

ఇందులో భాగంగా ఈసారి కూడా ఎల‌క్ట్రానిక్స్ , ఫ్యాష‌న్ , బ్యూటీ, ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై భారీగా డిస్కౌంట్స్ ఇవ్వ‌నుంది.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. వీటిని కొనుగోలు చేస్తే ఇంకొంత ప్ర‌యోజ‌నం చేకూరేలా డిస్కౌంట్ వ‌చ్చేలా చేస్తోంది.

యాక్సిస్ , ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారుల‌కు ఒక ర‌కంగా ల‌క్ అనే చెప్ప‌క త‌ప్ప‌దు.

సౌండ్ బార్లు, బోట్ కంపెనీ వ‌స్తువుల‌పై భారీ త‌గ్గింపు రానుంది. స్మార్ట్ వాచ్ ల‌పై 70 శాతం దాకా,  ఇంటెల్ ల్యాప్ టాప్ 40 శాతం త‌క్కువ‌కే ల‌భిస్తుంది.

వీటితో పాటు ల్యాప్ టాప్ లు, హెల్త్ కేర్ డివైజెస్ , స్మార్ట్ వేర‌బుల్స్ , హెడ్ ఫోన్స్ , స్పీక‌ర్లు , యాక్సెస‌రీల‌పై 80 శాతం దాకా త‌గ్గంచి ఇస్తోంది ఫ్లిప్ కార్ట్(Flipkart ).

టీవీల‌పై 70 శాతం, రిఫ్రిజిరేట‌ర్ల‌పై 50 శాతం, గృహోప‌క‌ర‌ణాల‌పై 70 శాతం వ‌ర‌కు అందుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే ఓ లుక్కేయండి. ఆనందాన్ని పొందండి.

Also Read : టీ హ‌బ్ మోడ‌ల్ దేశానికి అవ‌స‌రం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!