#Jiolaptop : జియో ల్యాప్ టాప్ రానుందా

త్వ‌ర‌లో మార్కెట్ లోకి వ‌చ్చేనా

Jiolaptop : రిల‌య‌న్స్ ఈ పేరు భార‌త్ లో పెను సంచ‌ల‌నం. ఈ దేశంలో మార్కెట్ రంగాన్ని శాసిస్తున్న ఒకే ఒక్క కంపెనీ ఏదైనా ఉందంటే అది రిల‌య‌న్స్ . ధీరూభాయి అంబానీ పెట్రోల్ బంకులో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రికీ మొబైల్ ఫోన్ ఉండాల‌ని క‌ల క‌న్నాడు.

ఆ క‌ల ఇప్పుడు ప్ర‌పంచాన్ని భార‌త్ వైపు చూసేలా చేసింది రిల‌య‌న్స్(Jiolaptop) . ఆయ‌న ఇప్పుడు భౌతికంగా లేక పోవ‌చ్చు.

కానీ కోట్లాది మంది భార‌తీయుల మ‌ధ్య క‌నెక్టివిటీ పెంచేలా చేస్తోంది రిల‌య‌న్స్ .

ఇత‌ర కంపెనీలు మోనోప‌లీ అని మొత్తుకున్నా లేదా మార్కెట్ స్ట్రాట‌జీని గంప గుత్త‌గా త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకోవాల‌ని చూస్తున్నార‌ని అనుకున్నా రిల‌య‌న్స్ త‌న‌కు తాను ఓ బ్రాండ్ గా మార్చేసుకుంది.

ఇప్పుడు దాని ఇమేజ్ ను అందుకోవాలంటే ఇంకొన్నేళ్లు ప‌ట్టేలా ఎదిగింది. సంచ‌నాల‌కు కేరాఫ్ మారింది రిల‌య‌న్స్ .

అత్యంత చౌక‌కే డేటా వినియోగం అన్న‌ది భార‌తీయ టెలికాం మార్కెట్ ను షేక్ చేసింది.

ఆ త‌ర్వాత రిల‌య‌న్స్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారికి కాసుల పంట పండిస్తోంది. చాలా మంది అనామ‌కుల‌ను కుబేరులుగా మార్చేసింది.

ముంబైలో జ‌రిగిన రిల‌య‌న్స్ మీటింగ్ లో ముకేశ్ అంబానీ చేసిన ప్ర‌క‌ట‌న దిగ్గ‌జ కంపెల‌కు బిగ్ షాక్ .

ప్ర‌పంచంలోనే అత్యంత చౌక‌నైన స్మార్ట్ ఫోన్ తీసుకు వ‌స్తామ‌ని డిక్టేర్ చేశారు. అదే జియో నెక్స్ట్ .

ఈనెల 10నే మార్కెట్ లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ ఎందుక‌నో రిలీజ్ చేయ‌లేదు.

తాజాగా భార‌త మార్కెట్ లోకి మ‌రో సంచ‌ల‌నానికి దారి తీసేలా ప్ర‌క‌ట‌న చేస్తార‌ని స‌మాచారం.

అదేమిటంటే జియో బుక్ ల్యాప్ (Jiolaptop)టాప్ ను లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

బీఐఎస్ లో స‌ర్టిఫికేష‌న్ కోసం జియో బుక్ ల్యాప్ టాప్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ధ‌ర మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Also Read : టీ హ‌బ్ మోడ‌ల్ దేశానికి అవ‌స‌రం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!