#SocialMedia : సోష‌ల్ మీడియాపై కంట్రోల్ ఎవ‌రిది

ఆదాయం పైనే ఫోక‌స్ డ‌ర్టీ పోస్టుల‌పై నో న‌జ‌ర్

Social Media : ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించే మాధ్య‌మాల్లో సోష‌ల్ మీడియా ఒక‌టి. ఒక‌ప్పుడు వేదిక‌లు చాలా త‌క్కువ‌. ఎప్పుడైతే ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ పెరిగిందో డిజిట‌ల్ మాధ్య‌మానికి ఎక్కువ ప్ర‌యారిటీ ల‌భిస్తోంది.

దీనిని ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. సామాజిక మాధ్య‌మాల ఎంత మంచి జ‌రుగుతుందో అంత కంటే ఎక్కువ‌గా చెడు వ్యాపిస్తోంది. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారింది.

ప్ర‌ధానంగా ఉగ్ర‌వాదుల‌కు, టెర్ర‌రిస్టుల‌కు, సంఘ వ్య‌తిరేక‌శ‌క్తుల‌కు, సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు, దోపిడీలు, అక్ర‌మాలు, అఘాయిత్యాలు చేసే వారికి ఇది ప్ర‌ధాన ఆయుధంగా మారుతోంది.

ఎలాంటి నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ లేక పోవ‌డం ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించింది. ఫేస్ బుక్ , వాట్సాప్, ట్విట్ట‌ర్ , యూట్యూబ్ , గూగుల్ , ఇన్ స్టా గ్రామ్ , పింటారెస్ట్, టెలిగ్రామ్(Social Media)..ఇలా లెక్క‌లేన‌న్ని అందుబాటులో ఉన్నాయి.

డిజిట‌ల్ సోష‌ల్ మీడియా (Social Media)ఫ్లాట్ ఫామ్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని శాసిస్తోంది.

దేశాల‌ను నాశ‌నం చేసే ఆయుధాలు, ఆటంబాంబుల కంటే సామాజిక మాధ్య‌మాలే ప్ర‌మాద‌ర‌కంగా త‌య‌ర‌య్యాయి.

ఇప్ప‌టికే త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను త‌స్క‌రిస్తున్నార‌నే ఆందోళ‌న‌లు ప్ర‌తి నిత్యం అందుతూనే ఉన్నాయి.

దిగ్గ‌జ టెక్నాల‌జీ సంస్థ‌లు, సోష‌ల్ మీడియా (Social Media)ఇటీవ‌ల ఎన్న‌డూ లేనంత‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

ప్ర‌స్తుతం తాలిబ‌న్ల‌కు ఇది ఓ వేదిక‌గా మారింద‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటోంది. వీరికి సంబంధించిన డేటాను, వారు వాడుకోకుండా గూగుల్ నియంత్రించే ప‌నిలో ప‌డ్డ‌ది.

టెర్ర‌రిస్టుల‌కు సంబంధించిన వీడియోల‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించింది.

దీనిపై ఇటీవ‌ల అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ దారుణంగా కామెంట్ చేశాడు.

కోట్లాది మంది సోష‌ల్ మీడియాలో భాగ‌స్వాములై ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ , వాట్సాప్ లు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాయి.

ఇత‌ర దేశాల‌లో కంటే భార‌త్ లో అవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇక్క‌డి ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా క‌ట్ట‌డికి ఐటీ చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింది.

ఇందుకోసం ప్ర‌త్యేకంగా నిపుణులైన ఆఫీస‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

మొద‌ట్లో వ్య‌తిరేకించినా ఆ త‌ర్వాత దారికొచ్చాయి.

వ్య‌క్తిగ‌త ద్వేషాలు, దూష‌ణ‌లు, విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా పోస్టులు పెడుతున్నా చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఎక్కువ‌య్యాయి.

ఇక‌నైనా సామాజిక మాధ్య‌మాలు మ‌రోసారి ఆలోచించాలి. ఒక‌టికి ప‌ది సార్లు ప్రొఫైల్స్ ను పూర్తిగా చెక్ చేశాకే వారికి వాడుకునే సౌలభ్యాన్ని క‌ల్పించాలి లేక పోతే ఆ సంస్థ‌ల‌తో పాటు ప్రపంచం కూడా ఇబ్బంది ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంది.

Also Read : భ‌వానీపూర్ లో బందూక్ ఎవ‌రో

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!