#Covid19 : పెరిగిన కేసులు త‌ప్ప‌ని ఇబ్బందులు

యుద్ద ప్రాతిప‌దిక‌గా వ్యాక్సినేష‌న్

Covid19 : దేశంలో మ‌ళ్లీ కోర‌నా త‌న పంజా విసురుతోంది. ఇంకా క‌రోనా సెకండ్ వేవ్ ముగియ లేద‌న్న‌ది వాస్త‌వం. నిన్న మొన్న‌టి దాకా 30 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా తాజాగా కొత్త‌గా 27 వేల 176 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో కేసుల సంఖ్య 3 కోట్ల 33 ల‌క్ష‌ల 16 వేల 755 కు చేరింది. ఇందులో 3 ల‌క్ష‌ల 51 వేల 087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 3 కోట్ల 25 ల‌క్ష‌ల 22 వేల 171 మంది క‌రోనా (Covid19)నుంచి కోలుకున్నారు.

మ‌రో 4 ల‌క్ష‌ల 43 వేల 497 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

నిన్న‌టి నుంచి నేటి దాకా కొత్త‌గా 38 వేల 12 మంది కోలుకున్నార‌ని, 284 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య శౄఖ ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 61 ల‌క్ష‌ల 15 వేల 690 మందికి క‌రోనా వ్యాక్సినేష‌న్ చేశామ‌ని వెల్ల‌డించింది.

దీంతో మొత్తం 75 కోట్ల 89 ల‌క్ష‌ల 12 వేల 277 వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి దాకా 54 కోట్ల 60 ల‌క్ష‌ల 55 వేల 796 న‌మూనాల‌కు ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి – ఐసీఎంఆర్ పేర్కొంది.

ఒక్క రోజే 16 ల‌క్ష‌ల 10 వేల 829 మందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే క‌రోనా థ‌ర్డ్ వేవ్ (Covid19)ముప్పు పొంచి ఉంద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించాయి ఎయిమ్స్ , ఎన్ఐడీఎం.

రాబోయే రెండు నెల‌లు అత్యంత జాగ్ర‌త్తగా ఉండాల‌ని పీఎంఓకు సూచించాయి.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని రాష్ట్రాలంద‌రికీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

అంతే కాకుండా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు గాను భారీ ఎత్తున ప్ర‌తి రాష్ట్రానికి నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.

Also Read : రాష్ట్రాలదే తుది నిర్ణ‌యం జోక్యం చేసుకోం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!