#GVLNarasihmaRao : రుణాల ఊబిలో ఏపీ స‌ర్కార్ – జీవీఎల్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎంపీ

GVL Narasihma Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ సభ్యుడు జీ వీ ఎల్ న‌ర‌సింహారావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణాల‌తోనే ఆ రాష్ట్రం ఇంత దాకా న‌డుస్తోంద‌న్నారు.

ఇంకా రుణాలు చేయ‌కుండా ఆ రాష్ట్ర బండిని క‌ష్ట సాధ్య‌మ‌న్నారు. మ‌నుగ‌డ ఇక ఎలా సాధిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

అప్పుల‌తోనే అభివృద్ది అనే సిద్ధాంతాన్ని ఆ స‌ర్కార్ ప్ర‌భుత్వం న‌మ్ముకుంద‌ని ఆరోపించారు.

రుణాల ఊబిలో ఏపీ రాష్ట్రం కూరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు దీనిని న‌డ‌ప‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు.

రుణం తీసుకోకుండా ఒక్క రోజు కూడా మ‌నుగ‌డ సాగించ లేని దుస్థితికి చేరుకుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే ఇంత‌టి గ‌డ్డు ప‌రిస్థితి నుంచి ఇంకా ఆ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్నారు జీవీఎల్(GVL Narasihma Rao).

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌య‌త్నం చేస్తేనే క‌దా గ‌ట్టెక్కేది అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇవాళ ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. మ‌రి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను మీరు అమ్మ‌కానికి పెట్టార‌ని ప్ర‌శ్నించ‌గా అదంతా విధాన ప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌న్నారు.

విశాఖ ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ అభివృద్ధిలోకి రావాల‌ని, ప్లాంటు ఉద్యోగుల సంక్షేమం గురించి కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ద‌ని చెప్పారు.

రివ‌ర్స్ టెండ‌ర్స్ త‌ర‌హాలోనే ఏపీ రివ‌ర్స్ లో వృద్ధిని సాధిస్తోంద‌ని జీవీఎల్ (GVL Narasihma Rao)ఎద్దేవా చేశారు. సినిమా టికెట్లే కాకుండా ఏపీ స‌ర్కార్ సినిమాలు కూడా నిర్మిస్తుందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

Also Read : ఏపీ సీఎస్ గా స‌మీర్ శ‌ర్మ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!