#Narayana : బూతుకు ప‌రాకాష్ట బిగ్ బాస్ – నారాయ‌ణ‌

24 గంట‌లు టెలికాస్ట్ చేయ‌గ‌ల‌రా

Narayana : స్టార్ మా చాన‌ల్ లో ప్ర‌సారమ‌వుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోపై (Narayana)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌. స‌భ్య స‌మాజం త‌ల దించుక‌నేలా ఈ కార్య‌క్ర‌మం ఉందంటూ మండిప‌డ్డారు.

దీని ద్వారా ఏం మెస్సేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా ఇది రెడ్ లైట్ సంస్కృతి లాంటింద‌ని ఆరోపించారు.

బిగ్ బాస్ రియాల్టీ షోను నిలిపి వేయాల‌ని కోరుతూ కోర్టుకు వెళ‌తాన‌ని హెచ్చ‌రించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ లో యువ‌తీ యువ‌కుల‌ను 105 రోజుల పాటు ఒకే గ‌దిలో ఉంచేలా చేస్తున్నార‌ని,

లోపల ముద్దులు, ముచ్చ‌ట్ల‌తో సాగదీస్తూ యూత్ ను, కుటుంబాల‌ను చెడ గొడుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారాయ‌ణ‌.

బ‌హిరంగంగా డేటింగ్ ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఇది ముమ్మాటికీ సాంస్కృతిక దోపిడీగా అభివ‌ర్ణించారు.

ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల స‌మాజానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ఈ ప్రోగ్రాంను రోజంతా ప్ర‌త్యక్ష ప్ర‌సారం చేయ‌గ‌ల‌రా అని నారాయ‌ణ(Narayana) నిల‌దీవారు.

దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని కోరారు. ఇలాగే చూస్తూ కూర్చుంటే స‌భ్య స‌మాజంపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇదిలా ఉండగా హైకోర్టు సూచ‌న‌లు పాటిస్తూ ట్యాంక్ బండ్ లో వినాయ‌క నిమ‌జ్జ‌నం చేయ‌వ‌ద్ద‌ని నారాయ‌ణ(Narayana) సూచించారు.

సినిమా టికెట్ల‌ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల‌ని ఏపీ స‌ర్కార్ చెప్ప‌డం మంచిదేన‌ని పేర్కొన్నారు. తెలంగాణ స‌ర్కార్ కూడా ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించాల‌న్నారు నారాయ‌ణ‌. వ్య‌వ‌స్థ‌ల్ని బ‌లోపేతం చేసేలా ప్రోగ్రామ్స్ ఉండాల‌ని ఇలా నిర్వీర్యం చేసి భ్ర‌ష్టు ప‌ట్టంచేలా ఉండ కూడ‌ద‌న్నారు.

Also Read : హుజూరాబాద్ లో గెలిచేది మేమే

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!