#ShakibAlHasan : ధోనీకే ష‌కీబ్ హ‌స‌న్ ప్ర‌యారిటీ

ఐపీఎల్ ఎలెవ‌న్ జాబితా డిక్లేర్

Shakib Al Hasan : కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది యూఏఈలో . భార‌త్ లో క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ -14వ సీజ‌న్ అర్ధారంతంగా వాయిదా ప‌డింది. 60 మ్యాచ్ లు ఆడాల్సి ఉండ‌గా 29 మ్యాచ్ లు పూర్త‌య్యాయి.

ఇంకా 31 మ్యాచ్ లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ త‌రుణంలో బంగ్లాదేశ్ స్టార్ ప్లేయ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ త‌న ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవ‌న్ లిస్టును డిక్లేర్ చేశాడు.

11 మందితో కూడిన టీంను రూపొందించాడు.

ఇందులో విండీస్ హిట్ట‌ర్ క్రిస్ గిల్ , ఏబీ డివిలియ‌ర్స్ కు చోటు ద‌క్క లేదు.

ష‌కీబ్ అల్ హ‌స‌న్(Shakib Al Hasan) ప్ర‌క‌టించిన టీంకు విచిత్రంగా భార‌త మాజీ క్రికెట్ కెప్టెన్ ,

సీఎస్కే చీఫ్ గా ఉన్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ను సార‌థిగా ప్ర‌క‌టించాడు.

అంతే కాకుండా వికెట్ కీప‌ర్ ప్లేస్ కూడా ఇచ్చాడు. ముంబై ఇండియ‌న్స్ కు చెందిన రోహిత్ శ‌ర్మ

, ఎస్ఆర్ హెచ్ కు చెందిన డేవిడ్ వార్న‌ర్ ల‌ను ఓపెన‌ర్లు గా ఎంపిక చేశాడు.

ఇక వ‌న్ డౌన్ లో భార‌త జ‌ట్టు సార‌థి విరాట్ కోహ్లీ, మిడిలార్డ‌ర్ లో ధోనీతో పాటు కింగ్స్ పంజాబ్ కు చెందిన కే ఎల్ రాహుల్ ను ఎంచుకున్నాడు.

ఆల్ రౌండ‌ర్లుగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టీంకు చెందిన బెన్ స్టోక్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ కు చెందిన ర‌వీంద్ర జ‌డేజా ను ఎంపిక చేశాడు.

విచిత్రం ఏమిటంటే ఎలాంటి స్పిన్న‌ర్లు లేకుండానే శ్రీ‌లంక‌కు చెందిన ల‌సిత్ మ‌లింగ , బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ ల‌ను ఫాస్ట్ బౌల‌ర్లుగా సెలెక్ట్ చేశాడు.

Also Read : పాక్ క్రికెట‌ర్ల‌కు భారీ న‌జ‌రానా

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!