#LasitMalinga : క్రికెట్ వార్ లో యోధుడు అత‌డు

యార్క‌ర్స్ స్పెష‌లిస్ట్ మ‌లింగ

Lasit Malinga : జీవితంలో ఎత్తు ప‌ళ్లాలు ఎలాగో క్రికెట్ లో ప్రారంభం ముగింపు ప‌ల్క‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక్కో ఆట‌గాడిది ఒక్కో ప్ర‌త్యేకం. క్రికెట్ అంటేనే మొద‌ట ఇంగ్లండ్ లో ప్రాచుర్యం ఉండేది.

ఆ త‌ర్వాత అది మెల మెల్ల‌గా ప్ర‌పంచాన్ని తాకింది. ఇప్పుడు ఎంత‌లా అంటే కోట్లాది రూపాయ‌లు కొల్లగొట్టే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇప్పుడు భార‌త్ ను ఊపేస్తోంది.

ఇక్క‌డ ఆటను యావ‌త్ భార‌తీయులంతా త‌మ‌లో చూసుకుంటారు. ఆడే క్రికెట‌ర్ల‌ను దేవుళ్ల కంటే గొప్ప‌గా ఆరాధిస్తారు.

బంతికీ బ్యాట్ కూ మధ్య జ‌రిగే సంగ్రామంలో ఎవ‌రు ఎప్పుడు పై చేయి సాధిస్తారో చెప్ప‌లేం.

జాతీయ క్రీడ‌గా ఉన్న హాకీ క్రికెట్ తుడిచేసింది. ఇప్పుడు క్రికెట్ విశ్వ వ్యాప్తంగా ఆక్ర‌మించుకున్న అరుదైన ఆట‌. ఇందులో రాణించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

భార‌త జ‌ట్టుకు 1983లో హ‌ర్యానా క‌రేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ తీసుకు వ‌చ్చాక ఇండియా అంటే క్రికెట్ క్రికెట్ అంటే భార‌త్ అన్న స్థాయికి మారి పోయింది.

ఇలాంటి అరుదైన ఘ‌న‌త‌ను తీసుకు వ‌చ్చాడు అర్జున ర‌ణ‌తుంగ శ్రీ‌లంక దేశానికి. అత‌డో రోల్ మోడ‌ల్. అత‌డు వ‌చ్చాక ఆ దేశ క్రికెట్ రూపు రేఖ‌లు మారి పోయాయి.

అద్బుత‌మైన మెరిక‌ల్లాంటి కుర్రాళ్లు అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి ఎంట‌ర‌య్యారు. క్రికెట్ ఆడే ప్ర‌పంచ దేశాల‌తో ఢీకొన గలిగే సామ‌ర్థ్యాన్ని తీసుకు వ‌చ్చాడు ర‌ణ‌తుంగ‌.

అత‌డి సార‌థ్యంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. ఆ త‌ర్వాత అద్భుత‌మైన ఆట‌గాళ్లు పుట్టుకు వ‌చ్చారు. స‌న‌త్ జ‌య‌సూర్య‌, అర‌వింద డిసిల్వ‌, రోష‌న్ మ‌హ‌నామా,

మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే, కుమార సంగ‌క్క‌ర, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ , చ‌మింద వాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంద‌రో
వ‌చ్చారు.

ఆ త‌ర్వాత ఒక్క‌డు మాత్రం రాకెట్ లా దూసుకు వ‌చ్చాడు. అత‌డే లసిత్ మ‌లింగ‌(Lasit Malinga ). బంతి ప‌ట్టుకుని వ‌స్తున్నాడంటే మాల్కం మార్ష‌ల్ ను గుర్తుకు తెచ్చేలా చేశాడు.

వేగ‌వంత‌మైన బాల్స్ తో ప్ర‌త్య‌ర్తుల‌కు చుక్క‌లు చూపించాడు. అత‌డి స్పెషాలిటీ యార్క‌ర్ల‌ను వేయ‌డం.

ఎంతటి దిగ్గ‌జ బౌల‌ర్ కైనా బౌలింగ్ చేయ‌డం సుల‌భ‌మేమో కానీ యార్క‌ర్లు వేయ‌డం చాలా క‌ష్టం.

కానీ ల‌సిత్ మ‌లింగ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అద్భుత‌మైన టెక్నిక్ అంత‌కంటే టైమింగ్ ఉన్న అరుదైన బౌల‌ర్ మ‌లింగ‌.

శ్రీ‌లంక క్రికెట్ కు ఊహంచ‌ని దెబ్బ‌. తీర‌ని లోటు కూడా మ‌లింగ లేక పోవ‌డం.

ఉన్న‌ట్టుండి అన్ని ఫార్మాట్ ల నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు మ‌లింగ‌(Lasit Malinga ).

త‌న‌ను ఆరాధించే అభిమానుల‌కు చేదు వార్త చెప్పాడు. మ‌లింగకు యార్క‌ర్ కింగ్ గా పేరు వ‌చ్చింది.

అత‌డి సార‌థ్యంలో 2014లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించింది శ్రీ‌లంక‌.

2004లో అరంగ్రేటం చేసిన మ‌లింగ వ‌రుస గాయాలు ఇబ్బంది పెట్టాయి. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు.

2011లో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. త‌ను బంతిని ముద్దాడే ప‌ద్ద‌తి, రింగులు తిరిగే జ‌ట్టు,

రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్ష‌న్ మ‌లింగ ప్ర‌త్యేకం. డెత్ ఓవ‌ర్ల‌లో మ‌లింగకు తిరుగే లేదు.

అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఐదు హ్యాట్రిక్ లు సాధించిన బౌల‌ర్ గా అత‌డి పేరు మీదే ఉంది.

ఐపీఎల్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచాడు. ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడాడు.

అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా రికార్డు త‌న పేరు మీదే ఉంది. శ్రీ‌లంక ఇవాళ గొప్ప ఆటగాడినే కాదు మ‌న‌స్సున్న వ్య‌క్తిని దూరం చేసుకుంది.

అత‌డు క్రికెట్ యుద్ధంలో ఎప్ప‌టికీ మ‌రిచి పోని యోధుడు. మ‌లింగ అల్విదా.

Also Read : అమ్మ స‌జీవం త‌లైవి అద్భుతం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!