#IITH : ఐఐటీ హైద‌రాబాద్ లో కొలువులు

నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం నోటిఫికేష‌న్

IITH  : ఉద్యోగాలు లేవ‌ని బాధ ప‌డుతున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. భార‌త దేశంలో అత్యుత్త‌మ విద్యా సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరొందిన భార‌తీయ సాంకేతిక విద్యా సంస్థ – ఐఐటీ – హైద‌రాబాద్(IITH )లో కొలువుల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

సంస్థ‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

ఆయా పోస్టుల‌కు సంబంధించి ఆన్ లోనైలో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ , సీనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్ , జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ , జూనియ‌ర్ ఇంజ‌నీర్ , త‌దిత‌ర పోస్టులు(IITH )ఉన్నాయి.

మొత్తం 24 పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఇందులో ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్ – ఎల‌క్ట్రిక‌ల్ , జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ , మ‌ల్టీ స్కిల్ అసిస్టెంట్ జీఆర్ ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి.

ఇక జూనియ‌ర్ ఇంజ‌నీర్ కు సంబంధించి సివిల్ 2 , ఎల‌క్ట్రిక‌ల్ 2 పోస్టులు ఉండ‌గా టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్ 7 పోస్టులు ఉన్నాయి.

జూనియ‌ర్ టెక్నిషియ‌న్ పోస్టులు 8 దాకా ఖాళీగా ఉన్నాయి.

ఆయా పోస్టుల‌కు సంబంధించి అర్హ‌త‌లు ఈ విధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఇ, బీటెక్ , ఎంటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంబీబీఎస్ , ఎమ్మెల్సీ ఫిజిక్స్ చేసి ఉండాల‌ని తెలిపింది.

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 40 ఏళ్ల లోపు వారై ఉండాల‌ని సూచించింది. రాత ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంద‌ని తెలిపింది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 500 క‌ట్టాల్సి ఉంటుంది.

ఆయా జాబ్స్ కోసం అప్లై చేసేందుకు వ‌చ్చే అక్టోబ‌ర్ 11 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించింది సంస్థ‌.

Also Read : జేఈఈ మెయిన్స్ రిజ‌ల్ట్స్ డిక్లేర్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!