#SonuSood : హీరో సోనూ సూద్ కు ఐటీ షాక్

నివాసాల‌పై ఆక‌స్మిక దాడులు

Sonu Sood : సోనూ సూద్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క‌రోనా క‌ష్ట కాలంలో ఏ న‌టుడికీ రానంత పాపులారిటీ వ‌చ్చింది ఆయ‌న‌కు. వేలాది మందికి ఆప‌న్న హ‌స్తం అందించారు. క‌ష్టాల్లో ఉన్నామంటూ స్పందించారు.

త‌న వంతుగా స‌హాయ స‌హ‌కారాలు అందించారు. త‌న ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టి కూడా బాధితుల‌కు అండ‌గా నిలిచారు.

ముఖ్యంగా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ , సెకండ్ వేవ్ ల‌లో సోనూ సూద్ పేద‌లు, సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు దేవుడిగా మారారు.

ఈ త‌రుణంలో ఆయ‌నకు ఇంత డ‌బ్బులు ఎలా వ‌స్తున్నాయ‌నే దానిపై ఇంకా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

ఎంతో మంది వ‌ల‌స కార్మికుల‌కు, పేద‌ల‌కు సాయం చేస్తూ రియ‌ల్ హీరోగా నిలిచాడు సోనూ సూద్(Sonu Sood).

వ‌ల‌స కార్మికుల గోస చూడ లేక తానే స్వంత ఖ‌ర్చులతో వారి ఇళ్ల‌కు చేర్చాడు.

దీంతో ఢిల్లీ ఆప్ ప్ర‌భుత్వం సోనూ సూద్ ను పాఠ‌శాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెంట‌ర్ షిప్ ప్రోగ్రామ్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఇటీవ‌ల నియ‌మించింది.

ఈ త‌రుణంలో ఇవాళ ఆక‌స్మికంగా ముంబైలో సోనూసూద్ కార్యాల‌యాన్ని ఆదాయ ప‌న్ను శాఖ త‌నిఖీ చేసింది. ఈ విష‌యాన్ని ఆ శాఖ ధ్రువీక‌రించింది కూడా.

ముంబై ఆఫీసు తో పాటు సోనూ సూద్ కు చెందిన మ‌రో ఆరు స్థ‌లాల్లో కూడా ఏక కాలంలో త‌నిఖీలు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ అధికారులు.

ఇదిలా ఉండ‌గా సోనూ సూద్ (Sonu Sood) ఢిల్లీలో ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో మీట్ అయ్యాక ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ దీనిపై ఆయ‌న స్పందించేందుకు నిరాక‌రించాడు. సామాజిక సేవ‌లోనే ఉంటాన‌ని పాలిటిక్స్ లోకి రాన‌న్నాడు.

Also Read : చిన్నారి అత్యాచారం బాధాక‌రం – మనోజ్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!