#JNTU : ఈ కోర్సులు చేస్తే కొలువులు ప‌క్కా

స్పెష‌ల్ కోర్సులపై జేఎన్టీయూ ఫోక‌స్

JNTU : టెక్నాల‌జీ మారుతోంది. కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌తి ఏటా సాంకేతిక ప‌రిజ్ఞానం రోజు రోజుకు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి దాకా పాత కోర్సుల‌తోనే నిర్వ‌హిస్తూ వ‌స్తున్న యూనివ‌ర్శిటీల‌న్నీ ఇప్పుడు త‌మ రూటు మార్చుకుంటున్నాయి.

వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ పెడుతున్నాయి. అంతే కాకుండా గ‌తంలో కోర్సుల వ‌ర‌కే ప‌రిమిత‌మై పోయిన ఇనిస్టిట్యూష‌న్స్ ఇప్పుడు కోర్సుల‌తో పాటు ప‌క్కాగా కొలువులు ఇచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించే ప‌నిలో ప‌డ్డాయి.

దీనికి త‌గ్గ‌ట్టుగా ఇంజనీరింగ్ సెక్టార్ లో కొత్త కోర్సులు వ‌స్తున్నాయి. ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీ కోర్సుల‌కు భారీగా మార్కెట్ లో డిమాండ్ ఉంటోంది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న జవ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్శిటీ – జేఎన్ టీయూ (JNTU)ప‌రిధిలో కొత్తగా ఆరు కోర్సుల‌ను ప్ర‌వేశ పెట్టింది.

బీటెక్ సీఎస్ఈ గ్రూప్ చేసే వారికి ఇవి అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. దీనిలో భాగంగా ఎంసెంట్ కౌన్సెలింగ్ కూడా ప్రారంభ‌మైంది.

ఇందులో ఫ‌స్ట్ ప్ర‌యారిటీగా మెషిన్ లెర్నింగ్ ను ఎంచుకోవ‌చ్చు.

ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్ కు ఈ టెక్నాల‌జీయే ఆధారంగా ప‌ని చేస్తుంది.

ఈ ఒక్క కోర్సు చేయ‌డం వ‌ల్ల దిగ్గ‌జ కంపెనీల్లో ఈజీగా జాబ్స్ సంపాదించు కోవ‌చ్చు. మ‌రో కోర్సు మెక‌ట్రానిక్స్ దీనికి విప‌రీత‌మైన డిమాండ్ ఉంది.

రోబోట్రిక్స్ , నానో టెక్నాల‌జీ కి ఈ కోర్సు(JNTU) బాగా ఉప‌యోగ ప‌డుతుంది.

ఇక అత్య‌ధికంగా వేత‌నాలు అందించే కోర్సు గా పేరొందింది కోడింగ్ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నిలిచింది.

హెవీ డిమాండ్ ఉన్న కోర్సుల్లో టాప్ లో ఉన్న కోర్సుగా సైబ‌ర్ సెక్యూరిటీ ఉంది.

సాంకేతిక స‌వాళ్ల‌ను ఎదుర్కొనే సామ‌ర్థ్యం దీని ద్వారా సాధ్య‌మ‌వుతుంది.

ఇక మ‌రో కోర్సు ఆటోమేష‌న్ అండ్ రోబోటిక్స్ కూడా. దీనికి కూడా భారీ ఎత్తున వేత‌నాలు అంద‌నున్నాయి.

Also Read : అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ రిలీజ్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!