#RohitSharma : మ‌లింగ అద్భుత‌మైన ప్లేయ‌ర్

ప్ర‌శంసించిన రోహిత్ శ‌ర్మ్

Rohit Sharma : అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించిన శ్రీ‌లంక స్టార్ ప్లేయ‌ర్ లసిత్ మ‌లింగ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. నీలాంటి ఆట‌గాడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మంటూ సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది.

రాకెట్ కంటే వేగంగా బంతులు విస‌ర‌డంలో నీకు నీవే సాటి అంటూ పేర్కొంటున్నారు.

తాజాగా ఆ అభిమానుల జాబితాలోకి భార‌త స్టార్ క్రికెట‌ర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌లింగ‌ను(Rohit Sharma) ఆకాశానికి ఎత్తేశాడు.

అత‌డో అద్భుత‌మైన ఆట‌గాడంటూ కితాబిచ్చాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంద‌ర్బంగా మ‌లింగ‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

నువ్వు నిజ‌మైన ఛాంపియ‌న్ వి. నీ క్రికెట్ కెరీర్ అద్భుతంగా సాగింద‌న్నాడు.

ముంబై ఇండియ‌న్స్ తో 12 ఏళ్ల అనుబంధం ఉంద‌న్నాడు. జ‌ట్టు విజ‌యంలో నీ పాత్ర చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నాడు రోహిత్ శ‌ర్మ‌.

నాలుగు సార్లు టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించావంటూ ప్ర‌శంసించాడు.

క్రికెట్ అనంత‌రం కూడా నీ లైఫ్ హ్యాపీగా సాగాల‌ని కోరాడు. నీలాంటి ఆట‌గాళ్లు క్రికెట్ లో అరుదుగా క‌నిపిస్తార‌ని తెలిపాడు. శ్రీ‌లంక జ‌ట్టు త‌ర‌పున ఎన్నో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు.

వ‌న్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పాడు ల‌సిత్ మ‌లింగ‌(Rohit Sharma). ఆ త‌ర్వాత ఐపీఎల్ ద్వారా మ‌రింత చేరువ‌య్యాడు. 2009 నుంచి 11 సీజ‌న్ల పాటు ఒకే ఒక జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

ఐపీఎల్ లో ఇప్ప‌టి దాకా ల‌సిత్ మ‌లింగ 170 వికెట్లు తీశాడు. అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో మ‌లింగ టాప్ లో ఉన్నాడు.

Also Read : క‌రోనా కాలం చెప్ప‌లేం – విరాట్ కోహ్లీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!