#MarutiSuzukiSwift : వాహ‌నాల‌ అమ్మ‌కాల్లో స్విప్ట్ జోష్

25 ల‌క్ష‌ల‌కు పైగా అమ్మ‌కాల్లో టాప్

Maruti Suzuki Swift ; భార‌త‌దేశంలో రెండు కంపెనీలు ఇప్ప‌టికీ త‌మ‌దైన ముద్ర‌ను కోల్పోలేదు. త‌రాలు గ‌డిచినా ఆ కంపెనీల వ‌న్నె త‌గ్గ‌లేదు. ఆ కంపెనీలు మారుతీ సుజుకీ, బ‌జాజ్. ఒక‌టి కార్ల త‌యారీలో టాప్ గా నిలిస్తే మ‌రొక‌టి స్కూట‌ర్లు, ఆటోల త‌యారీలో ముందంజ‌లో కొన‌సాగుతోంది.

ఎన్నో కంపెనీలు మార్కెట్ లోకి వ‌చ్చినా ఈ రోజు వ‌ర‌కు భార‌తీయుల మ‌నోభావాలు,

అభిరుచులు, ఆలోచ‌న‌ల‌కు త‌గ్గట్టు ఈ కంపెనీలు త‌యారు చేసిన‌ట్లుగా ఇంకే కంపెనీలు మ‌న‌సు దోచుకోలేక పోయాయి.

ఇక కార్ల విష‌యానికి వ‌స్తే వాహ‌నాల ఉత్ప‌త్తుల్లో, మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు అందించ‌డంలో ఈ రెండు కంపెనీలు ఇప్ప‌టికీ న‌మ్మ‌క‌మైన‌విగా పేరొందాయి.

ఒక వేళ కొత్త వాహ‌నం కొనుగోలు చేయాల‌ని అనుకొని త‌మ వ‌ద్ద ఉన్న వాహ‌నాల‌ను అమ్మాల‌ని అనుకున్నా గ్యారెంటీ ఇచ్చే కంపెనీలుగా మారుతీ(Maruti Suzuki Swift), బ‌జాజ్ పేరొందాయి.

తాజాగా మారుతీ కంపెనీ అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది.

ఈ కంపెనీ త‌యారు చేసిన సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ కారు (Maruti Suzuki Swift)న‌యా రికార్డును సృష్టించింది.

గ‌డిచిన 16 ఏళ్ల‌ల్లో 25 ల‌క్ష‌ల‌కు పైగా స్విఫ్ట్ కార్లు రోడ్డెక్కాయి. విక్ర‌యాల ప‌రంగా చూస్తే గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ మోడ‌ల్ టాప్ లో కొన‌సాగుతోంది.

ఇండియాలో 2005లో ఎంట‌రైంది. మోడ‌ల్ , సామ‌ర్థ్యం ప‌రంగా అద్భుత‌మైన డిమాండ్ స్వంతం చేసుకుంద‌ని మారుతీ కంపెనీ ప్ర‌క‌టించింది.

ఆద‌రిస్తున్న వినియోగ‌దారుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

విదేశాల‌కు చెందిన కంపెనీలు ఎన్ని మార్కెట్ లోకి వ‌చ్చినా ఈరోజు వ‌ర‌కు త‌న రికార్డును తానే అధిగ‌మిస్తోంది మారుతీ సుజుకీ.

Also Read : ఖాతాదారుల‌కు ఆర్బీఐ తీపి క‌బురు

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!