#Sangakkara : ఐపీఎల్ లో చావో రేవో తేల్చుకోవాలి

సంజూ శాంస‌న్ కు సంగ‌క్క‌ర నిర్దేశం

Sangakkara  : స‌ర్వ శ‌క్తులు కేంద్రీక‌రించాలి. విజ‌యం సాధించేంత దాకా పోరాటం చేయాలి. ఎక్క‌డా త‌గ్గ కూడ‌దు. త‌ల‌వంచ కూడ‌దు. స‌మిష్టిగా క‌ష్ట‌ప‌డితే గెలుపు మ‌న‌ద‌వుతుంది.

అందుకు కావాల్సింద‌ల్లా సంక‌ల్పం. మాన‌సికంగా సంసిద్ధులైతే ఐపీఎల్ టైటిల్ అందు కోవ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని దిశా నిర్దేశం చేశారు శ్రీ‌లంక మాజీ కెప్టెన్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర‌(Sangakkara).

ఒక వేళ పాయింట్ల పట్టిక‌లో చివ‌రి స్థానానికి ప‌డి పోయినా ప్ర‌య‌త్న లోపం లేకుండా త‌మ వంతుగా పోరాడామ‌న్న సంతృప్తి అయినా ప్ర‌తి ఒక్క‌రిలో ఉండాల‌న్నాడు.

ఫ‌స్ట్ ప్లేయ‌ర్ నుంచి ఆఖ‌రు వికెట్ దాకా ప్ర‌తి ఒక్క‌రు జ‌ట్టు పోరాడాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

మీలో ఎన‌లేని బ‌లం ఉంది. దానిని మీకు మీరుగా గుర్తించాలి. మ‌నం అద్భుత విజ‌యాలు సాధించాం.

కానీ కొన్ని మ్యాచ్ ల్లో స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ లేక పోయాం. అలా ఎందుకు చేయ‌లేద‌న్న దానిపై మీరంతా పున‌రాలోచించాల‌ని పిలుపునిచ్చారు కుమార సంగ‌క్క‌ర‌(Sangakkara).

ఐపీఎల్ లో 2008లో విజ‌యం సాధించిన మ‌నం ఎందుకు టైటిల్ గెల‌వ‌లేక పోయామ‌ని ఆలోచించాల‌న్నాడు.

మ్యాచ్ ప‌రంగా ఎక్క‌డా పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌త్య‌ర్థుల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లేవో గుర్తించాల‌న్నాడు.

ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెల‌వాల‌ని కోరాడు. క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ -2021 ను వాయిదా వేసింది బీసీసీఐ. ప్ర‌స్తుతం యూఏఈ వేదిక‌గా రెండో సీజ‌న్ ప్రారంభం కానుంది.

ఇప్ప‌టి దాకా 29 మ్యాచ్ లు జ‌రుగ‌గా ఇంకా 31 మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. సంజూ శాంస‌న్ ను ఉద్దేశించి సంగ‌క్క‌ర హిత బోధ చేసిన వీడియో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్ షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : భార‌త్ కు అత‌డే దిక్సూచి – జే షా

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!