#TTD : టీటీడీ పాల‌క మండ‌లి జాబితా విడుద‌ల

మ‌ళ్లీ జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావుకు చోటు

TTD : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నియ‌మించింది. 25 మంది టీటీడీ (TTD)పాల‌క మండ‌లిని ఏర్పాటు చేసింది.

ఈ పాల‌క మండ‌లిలో ఏపీ నుంచి న‌లుగురు, తెలంగాణ నుంచి న‌లుగురు స‌భ్యుల‌ను, త‌మిళ‌నాడు నుంచి ముగ్గురు, క‌ర్నాట‌క నుంచి ఇద్ద‌రు, మ‌హారాష్ట్ర నుంచి ఒక‌రు స్థానం ద‌క్కించుకున్నారు.

ఎక్స్ అఫిసియో స‌భ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కొన‌సాగుతున్నారు. పాల‌క మండ‌లిలో పారిశ్రామిక వేత్త‌లు మైహోం రామేశ్వ‌ర్ రావు, హేటిరో చైర్మ‌న్ పార్థ సార‌థి రెడ్డి , మురం శెట్టి రాములు,

వేమి రెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, ముంబ‌యికి చెందిన రాజేశ్ శ‌ర్మ‌, ఇండియా సిమెంట్స్ చైర్మ‌న్ శ్రీ‌నివాసన్ కు రెండోసారి చాన్స్ ద‌క్కింది.

వ్యాపార వేత్త మారుతి, ఆడిట‌ర్ స‌న‌త్ , ఎం.ఎస్.ఎన్ ల్యాబ్స్ ఎండీ జీవ‌న్ రెడ్డి, కోల్ క‌తాకు చెందిన సౌర్ భ్ పాల‌క మండ‌లిలో చోటు ద‌క్కించుకున్నారు.

మ‌హారాష్ట్ర నుంచి శివ‌సేన కార్య‌ద‌ర్శి మిలింద్ కు చాన్స్ ఇచ్చారు. ఈసారి రెండో సారి అవ‌కాశం క‌ల్పించారు తెలంగాణ నుంచి సీఎంకు ద‌గ్గ‌రి వ్య‌క్తిగా ,

చిన్న జీయ‌ర్ కు అనుచ‌రుడిగా పేరున్న మైహోం రామేశ్వ‌ర్ రావుకు ద‌క్కింది.

విచిత్రం ఏమిటంటే మ‌హబూబ్ న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి ఫ్యామిలీ నుంచి జీవ‌న్ రెడ్డికి అవ‌కాశం ల‌భించింది.

వీరిలో ఎక్కువ మంది డ‌బ్బున్న వాళ్లే ఉన్నారు. క‌ర్నాట‌క నుంచి ఎమ్మెల్యే విశ్వ నాథ్ రెడ్డి ఉన్నారు.

టీటీడీ(TTD) చైర్మ‌న్ గా ఇప్ప‌టికే మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించారు త‌న కుటుంబానికే చెందిన వైవీ సుబ్బారెడ్డి. ఆయ‌న అమెరికాలో ఉన్న కార‌ణంగా ప్ర‌క‌టించ లేదు.

ఇటీవ‌లే ఆయ‌న వ‌చ్చాక ప్ర‌మాణ స్వీకారం కూడా జ‌రిగింది. ఇందులో సామాన్య భ‌క్తులుకు ఎలాంటి చాన్స్ లేకుండా పోయింది.

Also Read : ప్ర‌పంచం ప్ర‌భుపాదం – న‌రేంద్ర మోదీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!