#JEEResults : జేఈఈ ఫ‌లితాల్లో టాప‌ర్స్ వీరే

ఓపెన్ కేటగిరీలో మృదుల్ అగ‌ర్వాల్

JEE Results : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన జేఈఈ రిజ‌ల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విడుద‌ల చేసింది వీటిని. ఓపెన్ కేట‌గిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగ‌ర్వాల్ తొలి స్థానంలో నిలిచింది.

ఓబీసీ ఎన్సీఎల్ విభాగంలో ప్రియాంశు యాద‌వ్ , జ‌న‌ర‌ల్ ఈడ‌బ్ల్యుఎస్ కేట‌గిరీలో రామ‌స్వామి సంతోష్ రెడ్డి, ఎస్సీ విభాగంలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేట‌గిరిలో బిజిలి ప్రచోత‌న్ వ‌ర్మ‌, జ‌న‌ర‌ల్ పీడ‌బ్ల్యూడీ విభాగంలో ఆర్ణ‌వ్ జైదీప్ క‌ల్ గుట్క‌ర్ తొలి స్థానాల్లో నిలిచారు.

జ‌న‌ర‌ల్ ఈడ‌బ్ల్యూఎస్ పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీలో యువ‌రాజ్ సింగ్ , ఓబీసీ ఎన్సీఎల్ పీడ‌బ్ల్యూడీ విభాగంలో గొర్లె కృష్ణ చైత‌న్య‌, ఎస్సీ పీడ‌బ్ల్యూడీ లో రాజ్ కుమార్ , ఎస్టీ పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీలో ర‌వి శంక‌ర్ మీనా  నిలిచారు.

బాలిక‌ల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన కావ్య చోప్రా ఫ‌స్ట్ ర్యాంకు సాధించింది. హైద‌రాబాద్ కు చెందిన లోకేశ్ రెడ్డి ఐదో ర్యాంకు పొందాడు.

గుంటూరుకు చెందిన రుషి కేష్ రెడ్డి కి ప‌దో ర్యాంకు రాగా విజ‌య‌వాడ‌కు చెందిన దివాక‌ర్ సాయి 11వ ర్యాంకులో నిలిచాడు.

జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష‌కు(JEE Results) మొత్తం ల‌క్షా 51 వేల 193 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ల‌క్షా 41 వేల 699 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

ఫ‌లితాల ప‌రంగా చూస్తే కేవ‌లం 41 వేల 862 మంది మాత్ర‌మే అర్హ‌త సాధించారు. వీరిలో 35 వేల 410 మంది బాలురు, 6 వేల 452 మంది బాలిక‌లు ఉన్నారు.

ఈ ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు స‌హా 114 విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ప్ర‌స్తుతం విద్యార్థుల కోసం దేశ వ్యాప్తంగా 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేప‌టి నుంచి ప్ర‌వేశాలు ప్రారంభం కానున్నాయి.

Also Read : ఈ కోర్సులు చేస్తే కొలువులు ప‌క్కా

Leave A Reply

Your Email Id will not be published!