#KCR : రైతుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

వానా కాలం వ‌డ్లూ కొనుగోలు

KCR  : తెలంగాణ రైతుల‌కు తీపిక‌బురు చెప్పారు సీఎం కేసీఆర్. ఇక ఈ వానా కాలానికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఆదేశించారు.

దీని వ‌ల్ల లక్ష‌లాది మంది రైతుల‌కు ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో మేలు జ‌రిగే చాన్స్ ఉంది. త‌క్ష‌ణ‌మే కొనుగోళ్లు చేప‌ట్టాల‌ని సీఎం(KCR )స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ అయ్యాయి.

గ‌తంలో లాగానే గ్రామాల్లోనే ధాన్యాన్ని సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. 135 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే వ‌డ్ల పైస‌లు వేయ‌నున్నారు.

అయితే డిఫాల్ట్ మిల్ల‌ర్ల‌కు ధాన్యాన్ని ఇవ్వ‌వ‌ద్దంటూ ప్ర‌భుత్వం ఆదేశించింది. కొనుగోళ్ల ప‌రిశీల‌న‌కు మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసింది.

రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను 1800-42500333, 1967 టోల్ ఫ్రీ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. దొడ్డు వ‌డ్లు కొన‌రంటూ ఇటీవ‌ల పెద్ద ఎత్తున విప‌క్షాలు రైతుల్లో ఆందోళ‌న క‌లిగించేలా ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

దీంతో ప‌రిస్థితిని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్ (KCR )రైతుల‌కు మేలు చేకూర్చేలా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వారి ఆందోళ‌న తొల‌గించి తాను ఉన్నానంటూ భ‌రోసా క‌ల్పించారు.

గ‌త వానా కాలంలో, యాసంగిలో మాదిరి గానే ఈసారి కూడా రైతుల నుంచి ప్ర‌తి గింజ‌నూ సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో వెంట‌నే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేక‌ర‌ణ ప్రారంభించాల‌ని ఆదేశించింది.

ఆధార్ నంబ‌ర్ చెక్ చేసి ధాన్యం కొనుగోలు చేస్తారు. గ్రేడ్ – ఏ ర‌కానికి రూ. 1,960 రూపాయ‌లు, సాధార‌ణ ర‌కానికి రూ. 1,940 రూపాయ‌ల ధ‌ర నిర్ణ‌యించింది తెలంగాణ స‌ర్కార్.

Also Read : రుణాల చెల్లింపులో రైతులు బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!