#IBPS : బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు

4, 135 పీఓ, మేనేజ్ మెంట్ ట్రైనీ జాబ్స్

IBPS : దేశ వ్యాప్తంగా ప్ర‌తిభ క‌లిగిన నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. భారీ ఎత్తున ఉద్యోగాల‌ను ప్ర‌క‌టించింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్(IBPS) – ఐబీపీఎస్.

వ‌చ్చే 2022-23 సంవ‌త్స‌రానికి గాను కామ‌న్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ద్వారా జాతీయ బ్యాంకుల్లో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ , మేనేజ్ మెంట్ ట్రైనీ ల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇందులో ఆయా ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 4 వేల 135 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2021 న‌వంబ‌ర్ 10వ తేదీ నాటికి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ పాసై ఉండాల్సి ఉంటుంది.

ఇక ఏజ్ వ‌చ్చే స‌రికి 2021 అక్టోబ‌ర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపిక విధానం మాత్రం ఆన‌ల్ లైన్ ద్వారా టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఇందులో వ‌చ్చిన ఆర్డ‌ర్ ఆఫ్ మెరిట్ ఆధారంగా ఇంట‌ర్వ్యూ చేప‌డ‌తారు.

అందులో టాప్ లో వ‌చ్చిన వారిని పీఓ, ఎంటీలుగా తీసుకుంటారు. ఇందులో భారీ గా వేత‌నాలు ఉండ‌నున్నాయి. ఇక ఉద్యోగాల‌కు సంబంధించి ప‌రీక్ష 100 మార్కుల‌కు ఉంటుంది.

60 నిమిషాలు మాత్ర‌మే టైం. ఇంగ్లీష్, హిందీ మాధ్య‌మాల్లో ప‌రీక్ష చేప‌డ‌తారు. ఇందులో అర్హులైన వారిని మెయిన్స్ కు పిలుస్తారు. ఈ ప‌రీక్ష 225 మార్కులు ఉంటుంది.

200 మార్కుల‌కు వివిధ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. మిగ‌తా 25 మార్కుల‌కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టెస్ట్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని మెయిన్స్ కు పిలుస్తారు.

ఇక ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు ప్రారంభం అక్టోబ‌ర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. చివ‌రి తేదీ వ‌చ్చే న‌వంబ‌ర్ 10. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష డిసెంబ‌ర్ 4, 11న చేప‌డ‌తారు.

మెయిన్స్ ఎగ్జామ్ 2022 జ‌న‌వ‌రిలో ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నెల‌లో ఉంటుంది.

Also Read : ఐఐటీ హైద‌రాబాద్ లో కొలువులు

Leave A Reply

Your Email Id will not be published!