#Yadadri : యాదాద్రికి మేఘా..హెటిరో 11 కిలోల బంగారం

పోటీ ప‌డి ప్ర‌క‌టిస్తున్న ప్ర‌ముఖులు

Yadadri : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడైతే యాదాద్రి (Yadadri)గోపురానికి బంగారం ప్ర‌క‌టించిన నాటి నుంచీ ప్ర‌ముఖులంతా పోటీ ప‌డి ప్ర‌క‌టిస్తున్నారు. వీళ్ల ప్ర‌క‌ట‌న‌ల్ని చూస్తే భ‌క్తులు సైతం విస్తు పోయేలా చేస్తున్నారు.

తాజాగా శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య విమాన గోపురం బంగారం తాప‌డానికి మేఘా ఇంజ‌నీరింగ్

అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చర్స్ లిమిటెడ్ – మెయిల్ 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

స్వామి వారికి బంగారం తాప‌డం ఎంతో ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మ‌ని తెలిపింది. ఇందులో తాము పాలు పంచుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని పేర్కొంది.

దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే 6 కేజీల బంగారం లేదా అందుకు స‌మాన‌మైన మొత్తాన్ని చెక్కు రూపంలో అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించింది.

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌, పుణ్య స్థ‌ల‌మైన యాదాద్రి సీఎం ఆలోచ‌న‌ల‌కు రూప‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

మెయిల్ తో పాటు ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల ప‌సిడి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల విహార్ ఎండీ రామ‌రాజు కిలో ప‌సిడిని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు.

ఇక ఇప్ప‌టి దాకా బంగారం విరాళంగా  సీఎం కేసీఆర్ కేజీ 16 తులాలు ప్ర‌క‌టించారు.

మంత్రి మ‌ల్లారెడ్డి 2 కిలోలు, ఎమ్మెల్యే మ‌ర్రి 2 కిలోలు బంగారం ప్ర‌క‌టించారు. మంత్రి హ‌రీష్ రావు 1 కిలో, న‌మ‌స్తే తెలంగాణ ఎండీ దామోద‌ర్ రావు 1 కిలో,

కావేరీ సీడ్స్ ఎండీ బాస్క‌ర్ రావు 1 కిలో, చిన్న జీయ‌ర్ పీఠం 1 కిలో, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 1 కిలో (Yadadri)ప్ర‌క‌టించారు.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ 1 కిలో, హ‌నుమంత‌రావు 1 కిలో, కృష్ణారావు 1 కిలో, కేవీ వివేకానంద 1 కిలో , ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ 1 కిలో ప్ర‌క‌టించారు.

ఎంపీ రంజిత్ రెడ్డి 1 కిలో , క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ 1 కిలో బంగారం ప్ర‌క‌టించారు. హెటిరో డ్ర‌గ్స్ 5 కిలోలు ప్ర‌క‌టించారు.

Also Read : యాదాద్రి ముహూర్తం ఖ‌రారు – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!