#Yadadri : విమాన గోపురం బంగారంతో తాప‌డం

ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Yadadri  : ప్ర‌పంచంలోనే క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ఆల‌యాన్ని(Yadadri )పునః ప్రారంభించేందుకు రంగం సిద్దం చేశారు సీఎం కేసీఆర్.

అయితే ప్రారంభం అయ్యాక కూడా అభివృద్ది ప‌నులు కొన‌సాగుతూనే ఉంటాయ‌న్నారు. స్వామి వారి గ‌ర్భ‌గుడిపై ఉండే విమాన గోపురానికి అద్భుత‌మైన స్వ‌ర్ణ తాప‌డం చేయించి తీరుతామ‌న్నారు.

దీని కోసం తిరుమ‌ల‌లో చేసిన వారిని సంప్ర‌దించార‌ని తెలిపారు. తిరుమల కంటే గొప్పగా ఉండాల‌ని కోరాన‌న్నారు. దీని కోసం అయ్యే ఖ‌ర్చు 125 కిలోలు అవుతుంద‌ని తెలిపార‌ని దానికి తాను ఓకే చెప్పాన‌న్నారు కేసీఆర్.

డ‌బ్బు రూపంలో దాని విలువ సుమారు రూ. 60 కోట్ల కు పైగానే అవుతుంద‌న్నారు. ఇదే విష‌యాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పంచుకున్నాన‌ని, వారంతా ప్ర‌తి గ్రామాన్ని, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇందులో పాలు పంచుకునేలా చేయాల‌ని సూచించార‌ని చెప్పారు కేసీఆర్.

వ్య‌క్తులు, భ‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, గ్రామాలు, కంపెనీలు ఇలా ఎవ‌రికి తోచిన రీతిలో వారు దానంగా, విరాళంగా ఇవ్వ‌వచ్చ‌ని సూచించారు. ఇందు కోసం మేలైన బంగారం కావాలి.

దీని కోసం ఆర్బీఐ నుంచి కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు సీఎం. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప‌ర్య‌వేక్షణ క‌మిటీ చూస్తుంద‌న్నారు.

ఇక విరాళం ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వ‌స్తున్నార‌ని, మొట్ట‌మొద‌టిగా ఒక కిలో 16 తులాల త‌మ కుటుంబం నుంచి ఇవ్వ‌నున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు.

మంత్రి మ‌ల్లారెడ్డి ఒక కిలో, నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే జ‌నార్ద‌న్ రెడ్డి కిలో బంగారాన్ని ఇస్తాన‌ని తెలిపార‌న్నారు. కావేరీ భాస్క‌ర్ రావు ఒక కిలో ఇస్తామ‌న్నారు.

దీవ‌కొండ దామోద‌ర్ రావు త‌న కుటుంబం నుంచి కేజీ ప‌సిడి ఇస్తాన‌న్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హ‌రీశ్ రావు కూడా ఇస్తామ‌న్నారు.

జీయ‌ర్ స్వామి వారు జీయ‌ర్ పీఠం నుంచి ఒక కిలో బంగారం ఇస్తామ‌న్నార‌ని చెప్పారు కేసీఆర్.

Also Read : ప‌ల్లా వెంక‌న్న స్ఫూర్తి దాయ‌కం

Leave A Reply

Your Email Id will not be published!