#Trump : డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోష‌ల్

కొత్త సోష‌ల్ నెట్ వ‌ర్క్ సైట్

Trump  : అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాపై గుర్రుగా ఉన్నారు. ఆయ‌న‌పై ఫేస్ బుక్, వాట్సాప్ , గూగుల్, యూట్యూబ్ , ట్విట్ట‌ర్ , ఇన్ స్టా గ్రామ్, త‌దిత‌ర సామాజిక దిగ్గ‌జ సంస్థ‌లు ట్రంప్ కు చెక్ పెట్టాయి.

ఆయ‌న దేశంలో అల్ల‌క‌ల్లోలాల‌కు కార‌ణ‌మ‌య్యేలా ప్ర‌సంగించార‌ని, ప్రేరేపించేలా చేశారంటూ నిషేధం విధించాయి. దీనిపై కోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా ఇంకా విచార‌ణ జ‌రుగుతోంది.

దీంతో తానే ఎందుకు ఈ రంగంలోకి దిగ కూడ‌ద‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు ట్రంప్(Trump ). తాజాగా తాను త్వ‌ర‌లో ప్రారంభించ‌బోయే సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు పేరు కూడా పెట్టారు.

అదే ట్రూత్ సోష‌ల్. ట్రంప్ మీడియా అండ్ టెక్నాల‌జీ గ్రూప్ దీనికి ఓన‌ర్ గా ఉంటుంది. వ‌చ్చే నెల‌లో కొంద‌రు ప్ర‌త్యేక ఆహ్వానితుల‌తో ఈ సోష‌ల్ నెట్ వ‌ర్క్ బీటా వెర్ష‌న్ లాంచ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఆపిల్ సంస్థ యాప్ స్టోర్ లో ఇది ప్రీ ఆర్డ‌ర్ పై అందుబాటులో ఉంటుంద‌ని టాక్. కాగా ఈ ఏడాది జ‌న‌వరిలో క్యాపిట‌ల్ హిల్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఆయా సంస్థ‌ల‌న్నీ ట్రంప్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి.

ఆనాటి నుంచి ట్రంప్ వాటిపై మాట‌ల తూటాలు పేలుస్తూ వ‌స్తున్నారు. దీంతో వీటి మీద ఆధార‌ప‌డే కంటే తానే ఎందుకు రంగంలోకి ఎంట‌ర్ కాకూడ‌ద‌న్న కోపంతో స్టార్ట్ చేశారు ట్రూత్ సోష‌ల్.

దీంతో పాటు ఓ వీడియో ఆన్ డిమాండ్ స‌ర్వీస్ ను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ టెక్ కంపెనీల ఆధిప‌త్యానికి చెక్ పెట్టేందుకే తాను ట్రూత్ సోష‌ల్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు ట్రంప్.

Also Read : డౌన్ లోడ్ లో టెలిగ్రామ్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!