#Bathukamma : బూర్జ్ ఖ‌లీఫాపై బతుక‌మ్మ

బతుక‌మ్మ‌కు అరుదైన గౌర‌వం

Bathukamma : తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసి, చ‌రిత్ర సృష్టించిన బ‌తుక‌మ్మకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. తెలంగాణ పూల పండుగ బ‌తుక‌మ్మ విశ్వ వేదిక‌పై త‌న గొప్ప‌త‌నాన్ని చాటేందుకు సిద్ద‌మైంది.

ఎమ్మెల్సీ క‌విత ఆధ్వ‌ర్యంలో ఈనెల 23న ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నం దుబాయి లోని బూర్జ్ ఖ‌లీఫాపై బతుక‌మ్మ‌ను(Bathukamma) ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి.

బూర్జ్ ఖ‌లీఫా మీద బ‌తుక‌మ్మ‌ను ప్ర‌ద‌ర్శించ బోయే తెర ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది కానుండ‌డం మ‌రో విశేషం. ఒకే సారి దేశ‌, విదేశాల‌కు చెందిన ల‌క్ష మందికి పైగా జ‌నం బూర్జ్ ఖ‌లీఫా తెర‌పై బ‌తుక‌మ్మ‌ను వీక్షించ‌నున్నారు.

బ‌తుక‌మ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి, ఖ్యాతిని ప్ర‌పంచానికి తెలియ చెప్పేందుకు ఎమ్మెల్సీ క‌విత ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

సాయంత్రం దుబాయిలో జ‌రగ‌బోయే ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, తెలంగాణ జాగృతి సంస్థ నాయ‌కులు, బాధ్యులు, ప్ర‌వాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

యూఏఈ ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, పారిశ్రామికవేత్త‌లు, ప‌లు కంపెనీల‌కు చెందిన బాధ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వ‌నంగా బూర్జ్ ఖ‌లీఫా(Bathukamma) గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఈ సంద‌ర్బంగా బ‌తుక‌మ్మ వీడియోను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా బ‌తుక‌మ్మ పండుగ‌కు విశ్వ వ్యాప్తంగా పేరు తీసుకు రావ‌డంలో క‌ల్వ‌కుంట్ల క‌విత ఎన‌లేని కృషి చేశారు. అటు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించేలా, మ‌హిళ‌ల‌ను పాల్గొనేలా చేశారు.

Also Read : యాదాద్రి ముహూర్తం ఖ‌రారు – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!