#SunderPichai : గూగుల్ ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

ఇక నుంచి ఫ్లెక్సి బుల్ వ‌ర్క్ వీక్

Sunder Pichai  : టెక్ దిగ్గ‌జం గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తమ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా కార‌ణంగా ఇంటి వ‌ద్ద ఉంటూ ప‌ని చేసేందుకే ఎక్కువ మంది ఎంప్లాయిస్ ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు.

ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గు ముఖం ప‌డుతుండ‌డంతో ఆల్ రెడీ గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ ఉద్యోగుల‌కు ఆఫీసుకు వ‌చ్చి ప‌ని చేయాలంటూ లేఖ రాశారు కూడా. కానీ వాటిని బేఖాత‌ర్ చేశారు చాలా మంది.

ఇంటి నుంచి ప‌ని చేయాలా లేక ఆఫీసుకు రావాల అనే విష‌యంలో కొంత కాలం పాటు సందిగ్ధ‌త నెల‌కొంది. దీనికి పూర్తిగా చెక్ పెట్టింది గూగుల్. ఆఫీసా లేక ఇల్లా అనే దానికి మ‌ధ్యే మార్గంగా మ‌రో ఆప్ష‌న్ ఉద్యోగుల‌కు ఇచ్చింది.

కొత్త విధానం అమ‌ల్లోకి తీసుకు రానున్న‌ట్లు కంపెనీ సిఇఓ సుంద‌ర్ పిచాయ్(Sunder Pichai )వెల్ల‌డించారు. కోవిడ్ సెకండ్ వేవ్ అనంత‌రం ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మెల మెల్ల‌గా సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా రాకెట్ కంటే స్పీడ్ గా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే చైనా, భార‌త్ దేశాలు 100 కోట్ల మైలు రాయి దాటాయి. దీంతో ఆయా కంపెనీలు ఆఫీసుల‌కు రావాలంటూ కోర‌నున్నాయి.

మ‌రో వైపు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ ఇప్ప‌టికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. గూగుల్ సంస్థ ఉద్యోగుల ప‌ని విధానం విష‌యంలో కొత్త విధానం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఫ్లెక్సిబుల్ వ‌ర్క్ వీక్ మెథ‌డ్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సుంద‌ర్ పిచాయ్(Sunder Pichai ). ఇందులో మూడు రోజుల పాటు ఇంటి నుంచి, 2 రోజుల పాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. దీనిపై ఎంప్లాయిస్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Also Read : మార్కెట్ లో టాటా ‘పంచ్’ అదిరింది

Leave A Reply

Your Email Id will not be published!