#KishanReddy : యునెస్కోకు మ‌రిన్ని ప్ర‌తిపాద‌న‌లు

పంపుతామ‌న్న కేంద్ర మంత్రి జీకేఆర్

Kishan Reddy : తెలంగాణకు ఎంతో చ‌రిత్ర ఉంది. అంతకంటే గొప్ప‌నైన ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి(Kishan Reddy). పురాత‌న రామ‌ప్ప ఆల‌యం యునెస్కో గుర్తింపు పొంద‌డం గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల త‌ర‌పున రామ‌ప్ప‌కు ప్ర‌పంచ ప‌టంలో ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింద‌ని చెప్పారు. మ‌రో 25 ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను యునెస్కో గుర్తింపు కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తామ‌న్నారు.

రామ‌ప్ప రుద్రేశ్వ‌ర ఆల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. ప్ర‌పంచ వార‌స‌త్వ శిలా ఫ‌లకాన్ని, మౌలిక స‌దుపాయాల‌ను ప్రారంభించారు.

వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ది చేసి స‌బ్సిడీతో అతి త‌క్కువ విమాన చార్జీల‌తో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు జీకేఆర్.

2016 నుంచి రామ‌ప్ప‌కు యూనెస్కో గుర్తింపు కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపించామ‌ని కానీ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంద‌న్నారు. ఆయా దేశాల‌తో విదేశాంగ శాఖ త‌ర‌పున పీఎం మోదీ మాట్లాడారని, వారు రామ‌ప్ప‌కు అనుకూలంగా ఓటు వేశార‌ని చెప్పారు.

ఇందులో భాగంగానే 17 దేశాలు రామ‌ప్ప‌కు అనుకూలంగా ఓటు వేశాయ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో కాక‌తీయుల క‌ట్ట‌డాలు, శిల్ప క‌ళా నైపుణ్యం ప‌రిర‌క్షించు కోవాల‌ని, నేటి యువ‌తరానికి వాటి గురించి తెలియ చెప్పాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి వీఎస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

రాష్ట్రంలో ప‌ర్యాట‌క స్థలాల‌ను మ‌రింత అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను స‌మ‌కూర్చుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు వీఎస్ గౌడ్.

Also Read : యాదాద్రిని ద‌ర్శించుకున్న కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!