#JioPhoneNext : దీపావళి లోపు జియో స్మార్ట్ ఫోన్

అందుబాటు ధ‌రలో అన్ని ఫీచ‌ర్స్

Jio Phone Next : భార‌తీయ మార్కెట్ దిగ్గ‌జం రిల‌య‌న్స్ గ్రూప్ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. ఎప్ప‌టి నుంచో ప్ర‌తి సామాన్యుడు సైతం త‌మ ఫోన్ వాడ‌ల‌న్న‌ది ఆ సంస్థ క‌ల‌. దానిని నిజం చేసింది కూడా.

ఒక‌ప్పుడు ఫోన్ అంటే డ‌బ్బున్న వాళ్ల‌కే అనుకునే రోజుల్లో రిల‌య‌న్స్ తీసుకు వ‌చ్చిన ఫోన్ చ‌రిత్ర తిర‌గ రాసింది. ఆ త‌ర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

కానీ రిల‌య‌న్స్ మ‌రింత ముందుకు వెళుతూనే ఉంది. మార్కెట్ ప‌రంగా కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వాటన్నింటిని త‌ట్టుకుంటూ భార‌తీయ వ్యాపార సామాజ్రంపై త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే స‌ద‌రు సంస్థ‌తో ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఆ త‌ర్వాత అత్యంత త‌క్కువ ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్ ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముంబైలో జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ప్ర‌క‌టించాడు.

దీంతో ఆ ఒక్క ప్ర‌క‌ట‌న సంస్థ షేర్స్ అమాంతం పెరిగాయి. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు, షేర్స్ క‌లిగిన వాళ్లు ఒక్క రోజులోనే ధ‌నికులై పోయారు.

ఇదీ అస‌లైన మార్కెట్ తంత్రం అంటే. కాగా జియో నెక్ట్స్(Jio Phone Next) పేరుతో స్మార్ట్ ఫోన్ విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ముకేష్ అంబానీ. అత్యాధునిక ప్ర‌గ‌తి ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తో మార్కెట్ లోకి వ‌స్తోంది.

దీనిని రెండు సంస్థ‌లు అంటే రిల‌య‌న్స్ , గూగుల్ ఉమ్మ‌డిగా డెవ‌ల‌ప్ చేశాయి. దీపావ‌ళి లోపు రానున్న‌ట్లు టాక్. క్వాల్ కామ్ చిప్ సెట్ , ఆండ్రాయిడ్ , ట‌చ్ స‌ర్వీసెస్ ఈ ఫోన్ స్పెషాలిటీ. ధ‌ర కూడా కేవ‌లం 3 వేల 500 రూపాయ‌ల లోపు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : డౌన్ లోడ్ లో టెలిగ్రామ్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!