#ShriSubhudenraTeertha : సుబుదేంద్ర తీర్థ సుఖీభ‌వ

మంత్రాల‌య పీఠాధిప‌తి ఆధ్యాత్మిక‌త‌కు దిక్సూచి

Shri Subhudenra Teertha : ఈ దేశం ఆధ్యాత్మిక‌కు ఆల‌వాలంగా నిలుస్తూ వ‌స్తోంది. ఎంద‌రో మ‌హానుభావులు, స్వాములు, గురువులు, పీఠాధిప‌తులు కొలువు తీరింది ఈ పుణ్య భూమి. జీవితం పరిపూర్ణం కావాలంటే భ‌క్తి అన్న‌ది ముఖ్య‌మ‌ని, సేవ చేయ‌డం ద్వారానే జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంద‌ని చెప్పిన మ‌హానుభావుడు శ్రీ రాఘ‌వేంద్ర స్వాముల వారు.

ఆయ‌న వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రపంచ ఆధ్మాత్మిక వార‌స‌త్వానికి ప్ర‌తీక‌గా నిలిచిన మంత్రాల‌య పుణ్య క్షేత్రానికి, మ‌హిమాన్విత మ‌ఠానికి పీఠాధిప‌తిగా జ‌గ‌మెరిగిన శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వాముల వారు ఉన్నారు.

ఆయ‌న నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు రూపు దిద్దుకున్నాయి.

ప్ర‌తి చోటా ఆధ్యాత్మిక‌త వెల్లి విరాయ‌ల‌నే స‌త్ సంక‌ల్పంతో స్వాముల వారు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు.

ఏ ఒక్క‌రూ ఆక‌లితో ఉండ కూడ‌ద‌న్నది సుబుదేంద్ర తీర్థ స్వాముల వారి ల‌క్ష్యం. ఆ దిశ‌గా నిత్యం అన్న‌దానం జ‌రిగేలా కృషి చేశారు.

దేశ మంత‌టా శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌లో అమ‌లు అయ్యేలా చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు.

ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వాముల (Shri Subhudenra Teertha)గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భార‌తీయ ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.

కుల‌, మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ రాఘవేంద్ర స్వాముల కృప‌కు పాత్రులు కావాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఆయ‌న అడుగు జాడ‌ల్లో ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది భ‌క్తులు న‌డుస్తున్నారు.

ఆయ‌న క‌ను చూపు కోసం, స్వామి వారి ఆశీస్సుల కోసం ప‌రితపిస్తున్నారు. తండోప తండాలుగా మంత్రాల‌యానికి త‌ర‌లి వ‌స్తున్నారు.

వ్య‌క్తి ఆరాధ‌న కంటే స్వామి ఆరాధ‌నే ముఖ్య‌మ‌ని చెబుతారు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వాములు(Shri Subhudenra Teertha).

ఆయ‌న‌కు 10 భాష‌ల‌పై ప‌ట్టుంది. అద్భుతమైన భ‌క్తి ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లె వేస్తారు.

ఆధ్యాత్మిక‌త ప్ర‌పంచం వ‌ల్ల ఎలా ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో వివ‌రిస్తారు. స‌మాజంలో అన్ని వ‌ర్గాల గురించి సుబుదేంద్ర తీర్థుల వారికి అవ‌గాహ‌న ఉంది.

ఏ ఒక్క‌రు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేలా ఇతోధికంగా సాయం చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

దేశ వ్యాప్తంగా మంత్రాల‌య స్వామి వారి మ‌ఠాల‌ను నెల‌కొల్పాల‌న్న‌దే సుబుదేంద్ర తీర్థ స్వామి వారి ల‌క్ష్యం.

తాను పీఠాధిప‌తిగా కొలువు తీరాక రాఘ‌వేంద్ర ఆల‌యం, మ‌ఠాన్ని అత్యాధునిక వ‌స‌తుల‌తో, దేదీప్య‌మానంగా న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో తీర్చిదిద్దేలా చేశారు.

ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేలా స‌క‌ల సౌక‌ర్యాలు అందేలా ప్ర‌య‌త్నించారు.

ప్ర‌తి చోటా ప్ర‌తి నోటా ఆ రాఘ‌వేంద్రుని నామ స్మ‌ర‌ణ ఉండేలా చూస్తున్నారు.

ప్ర‌తి పీఠం ఆధ్యాత్మిక భావ ధార‌ణ‌తో ఉండాల‌ని ఆయ‌న కోరుకుంటారు. అలాగే చేస్తున్నారు కూడా.

ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. మ‌ఠంలో ప‌ని చేసే ప్ర‌తి ఒక్క‌రికి ఆలంబ‌న‌గా నిలిచారు. వారికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇందులో భాగంగా ప్ర‌తి చోటా వేద పాఠ‌శాల‌లు, సంస్కృత పాఠ‌శాల‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్ప‌టికే కొన్ని న‌డుస్తున్నాయి. ఇక మంత్రాల‌యంలో ఆధునిక ఉన్న‌త వైద్య కళాశాలకు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త మ‌న సుబుదేంద్ర తీర్థుల స్వాముల వారిదే.

దేశ వ్యాప్తంగా దాతలు స‌హృద‌యతతో ముందుకు వ‌స్తే మ‌ఠాలు నిర్మంచేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు .
భ‌క్తుల‌కు భోజ‌న, వ‌స‌తి సౌక‌ర్యాలు నిరంత‌రాయంగా ఉండేలా చేశారు.

రూ. 2 వేల కోట్ల‌తో మంత్రాల‌యం ముఖ ద్వారం , ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టారు.

దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తుల కోసం మంత్రాల‌యం మ‌ఠం ద్వారా రైలు మార్గం వెళ్లేలా ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ ను ఒప్పించారు.

అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల‌కు సంబంధించి స‌మాచారాన్ని,

వివ‌రాల‌కు సంబంధించి , ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను చేర‌వేసేందుకు గాను ఎస్ఆర్ఎస్ ఫౌండేష‌న్ ద్వారా ఎస్ఆర్ఎస్ భ‌క్తి టీవీ ఏర్పాటు చేశారు.

ఇక మ‌ఠాల ద్వారా శిల‌లు, క‌ళ్యాణ మంట‌పాల ద్వారా వేలాది మందికి ఉపాధి క‌ల్పించేందుకు శ్రీ‌కారం చుట్టారు సుబుదేంద్ర తీర్థ స్వామి వారు.

మ‌ఠం ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చర్య‌లు చేప‌ట్టారు.

దాత‌ల‌, భ‌క్తుల స‌హ‌కారంతో వేలాది మంది భ‌క్తుల కోసం ఉచితంగా అన్న‌దానం స‌త్రాలు, వ‌స‌తి గృహాలు, తుల‌సి వ‌నాలు

వృద్ధా శ్ర‌మాలు, గోశాల‌ల ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వారి హ‌యాంలోనే మంత్రాల‌యంలో బృందావ‌నం గుడి, గోపురం అత్యాధునికంగా నిర్మించారు.

భ‌క్తుల కోసం మ్యూజియం, స్నాన ఘ‌ట్టాలు, 24 గంట‌ల పాటు ఉచితంగా వైద్య సౌక‌ర్యం ఏర్పాటు.

శ్రీ రాఘ‌వేంద్ర స్వాముల వారి జీవిత చ‌రిత్ర‌ను తెలుగు నుంచి అన్ని భాష‌ల్లోకి అనువాదం చేయ‌డం. మంత్రాల‌యంలోని వేద పాఠ‌శాల‌ను ఆధునీక‌రించేలా చేశారు.

భక్తుల సౌక‌ర్యార్థం మొబైల్ వ్యాన్లు, సీసీ టీవీల ఏర్పాటుపై ఫోక‌స్ పెట్టారు. ఇంత వ‌రకూ ఎవ‌రూ చేయ‌ల‌ని అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వాములు(Shri Subhudenra Teertha) శ్రీ‌కారం చుట్టారు.

మిగ‌తా మ‌ఠాధిప‌తులు, పీఠాధిపతుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. సుబుదేంద్రా సుఖీ భ‌వ అంటున్నారు భ‌క్తులు.

Also Read : యాదాద్రికి మేఘా..హెటిరో 11 కిలోల బంగారం

Leave A Reply

Your Email Id will not be published!