#YVSubbaReddy : అన్న‌దాత‌ల‌కు టీటీడీ ఆలంబ‌న

స్ప‌ష్టం చేసిన చైర్మ‌న్ వైవీఎస్

YV Subba Reddy  : ఎలాంటి పురుగు, ఎరువుల మందులు వాడ‌కుండా కేవ‌లం గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసే రైత‌న్న‌ల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy ).

తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు జాతీయ గో మ‌హా స‌మ్మేళ‌నం జ‌రుగుతోంది. టీటీడీ అన్న ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు.

ఈ స‌మ్మేళ‌నాన్ని వైవీఎస్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నేల త‌ల్లిని ర‌క్షించేందుకే ఈ మ‌హా స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసే ప్ర‌తి ఒక్క‌రికి తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర చెల్లించి వారు పండించిన గో ఆధారిత ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాల‌ని టీటీడీ పాల‌క మండ‌లిలో ఇప్ప‌టికే తీర్మానం చేశామ‌న్నారు. ఇదే తీర్మానాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించ‌డం జ‌రిగింద‌న్నారు.

సీఎం జ‌గ‌న్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు టీటీడీ పాల‌క మండ‌లి స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారం చేస్తూనే మ‌రో వైపు గో సంర‌క్ష‌ణ కోసం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు.

ఎరువుల‌తో త‌యారైన దాణా తినే ఆవుల పాల వ‌ల్ల మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్, త‌దిత‌ర రోగాలు వచ్చే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంద‌న్నారు.

అందు వ‌ల్ల‌నే సీఎం ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. కాగా ఈ స‌మ్మేళ‌నంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో టీటీడీకి చెందిన నాలుగు స్టాల్స్ ఉన్నాయి. రైతుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు.

Also Read : యాదాద్రికి మేఘా..హెటిరో 11 కిలోల బంగారం

Leave A Reply

Your Email Id will not be published!