#Xiaomi11Pro : అమ్మ‌కాల్లో రెడ్ మీ నోట్ 11 రికార్డ్

గంట‌లో 5 ల‌క్ష‌ల ఫోన్లు సేల్

Xiaomi 11 Pro  : ప్ర‌పంచ మార్కెట్ ను శాసిస్తూ వ‌స్తున్న దిగ్గ‌జ కంపెనీల‌కు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తున్నాయి చైనా స్మార్ట్ ఫోన్లు. రెడ్ మీ, రియ‌ల్ మీ, వివో, త‌దిత‌ర మొబైల్స్ కంపెనీలు త‌మ హ‌వాను కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి.

తాజాగా 3వ త్రైమాసిక రిజ‌ల్ట్స్ విడుద‌ల‌య్యాయి. చైనాకు చెందిన షావోమీ సంస్థ‌కు చెందిన రెడ్ మీ 9 సీరీస్ ఫోన్లు ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లుగా రికార్డు సృష్టించాయి.

ఇదే కంపెనీకి చెందిన రెడ్ మీ నోట్ 11 ఫోన్ అమ్మ‌కాల్లో టాప్ లో ఉంటోంది.

సేల్స్ లో భాగంగా సంస్థ ప్ర‌క‌టించిన గంట లోపు ఏకంగా 5 ల‌క్ష‌ల ఎక్కువ యూనిట్లు అమ్ముడు పోవ‌డం విశేషం.

ఈ విష‌యాన్ని షావోమీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఫోన్ ల అమ్మ‌కాలు ప్రారంభ‌మైన మొద‌టి 52 నిమిషాల 11 సెక‌న్ల‌లో 4 బిలియ‌న్ యువాన్ ల బిజినెస్ జ‌రిగింద‌న్నారు.

ఈ మొత్తం అమ్మ‌కాల్లో భార‌త్ టాప్ లో ఉండ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా రెడ్ మీ నోట్ 10 విడుద‌లైన 3 నెల‌ల్లో ఒక్క భార‌త్ లోనే 20 ల‌క్ష‌ల ఫోన్లు అమ్ముడైన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది.

భారీ ఎత్తున డిమాండ్ ఉంటున్న ఈ ఫోన్ల‌కు భారీగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా ఇంత కాలం పాటు డామినేట్ చేస్తూ వ‌చ్చిన ఆపిల్, శాంసంగ్ , మోటోరాలా, నోకియా కంపెనీల‌కు షాకింగ్ ఇస్తూ వ‌చ్చింది.

కాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ రెడ్ మీ నోట్ 11(Xiaomi 11 Pro )ధ‌ర రూ. 14 వేలు ఉండ‌గా 6 జీబీ ర్యామ్ 128 జీబీ క‌లిగిన రెడ్ మీ నోట్ 11 ప్రో రూ. 18 వేల 700గా ఉంది.

రెడ్ మీ నోట్ 11 ప్రో ప్ల‌స్ రూ. 22 వేలు ఉంటే 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ క‌లిగిన ఫోన్ ధ‌ర రూ. 31 వేలుగా నిర్ణయించింది.

Also Read : దీపావ‌ళికి జియో నెక్ట్స్ క‌న్ ఫ‌ర్మ్

Leave A Reply

Your Email Id will not be published!