#ApsrtcTTD : శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

ఇక బస్సుల్లోనే స‌ర్వ ద‌ర్శ‌నం టికెట్లు

Apsrtc TTD : ఓ వైపు తెలంగాణ ఆర్టీసీ నానా తంటాలు ప‌డుతుంటే మ‌రో వైపు ఏపీఎస్ఆర్టీసీ మాత్రం వినూత్న ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతోంది. ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ రెడ్డి ఫుల్ భ‌రోసా ఇచ్చారు.

వారిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ(Apsrtc TTD) ఆదాయ బాట‌లో ప‌రుగులు తీస్తోంది. ప్ర‌యాణికుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఏర్పాట్లు చేసింది. మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగా నిత్యం వేలాది మంది ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏకంగా బ‌స్సుల్లోనే రూ. 300 స‌ర్వ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు రోడ్డు ర‌వాణా సంస్థ ప్ర‌క‌టించింది.

వీఐపీల సిఫార‌సు లేకుండా ఇక నుంచీ నేరుగా తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భాగ్యాన్ని ప్ర‌సాదించించింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి రోజూ వేయి (1000) టికెట్లు అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.

రూల్స్ మేర‌కు ఈ టికెట్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్ల నుంచి తిరుమ‌ల‌కు రావాలంటే జంకుతున్నారు భ‌క్తులు. రాను రాను త‌గ్గు ముఖం ప‌డుతుండ‌డంతో నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ వ‌స్తోంది టీటీడీ.

భ‌క్తుల సంఖ్య‌ను పెంచుతూ ఉచిత ద‌ర్శ‌నాలు, వీఐపీ బ్రేక్, రూ. 300 ద‌ర్శ‌నాలు క‌రోనా రూల్స్ పాటిస్తూ ప‌ర్మిష‌న్ ఇస్తోంది. ఆన్ లైన్ లో విక్ర‌యిస్తుండ‌డంతో చాలా మంది తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు.

దీనిని గ‌మ‌నించిన ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో, ఆన్ లైన్ ద్వారా వేయి టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.

Also Read : యునెస్కోకు మ‌రిన్ని ప్ర‌తిపాద‌న‌లు

Leave A Reply

Your Email Id will not be published!