#ToyotaCrossover : మార్కెట్ లో ఎస్‌యూవీ లుక్స్ అదుర్స్

డిజైనింగ్ లో ట‌యోటా వెహికిల్ వారెవ్వా

Toyota Crossover : భార‌తీయ ఆటో మొబైల్ మార్కెట్ లో చిన్న కార్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లకు రెక్క‌లు రావ‌డంతో భారీ పోటీ నెల‌కొంది.

టాటా, హూందాయి, ట‌యోటా, మ‌హీంద్రా, త‌దిత‌ర కంపెనీలు పోటా పోటీగా వాహ‌న ప్రియుల‌కు అనువుగా వెహికిల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ట‌యోటా అధికారికంగా త‌న కొత్త మైక్రో ఎస్ యవీ కారు ఐగో ఎక్స్ ను ఆవిష్క‌రించింది.

గ‌తంలో కొద్ది రోజుల కింద‌ట మ‌న దేశంలో విడుద‌లైన టాటా మోటార్స్ పంచ్ ను విడుద‌ల చేసింది. సేమ్ టు సేమ్ వెహికిల్ ను ట‌యోటా కారును ప్ర‌వేశ పెట్టింది. జీఏ-బి ఫ్టాల్ ఫామ్ ఆధారంగా రూపొందించారు.

ఈ ట‌యోటా ఐగో ఎక్స్ కారు 3, 700 మిల్లీమీట‌ర్ల పొడ‌వు, 1, 740 మిమీ వెడ‌ల్పు, 1,510 మిమీ ఎత్తు ఉంది. ఈ ట‌యోటా ఐగో ఎక్స్ పెద్ద ఫ్రంట్ గ్రిల్ , ఫాగ్ ల్యాంప్స్ , హెడ్ లైట్ల‌తో పాటు ఎల్ఈడీ ప‌గ‌టి పూట ర‌న్నింగ్ లైట్ల‌తో(Toyota Crossover) ఆక‌ట్టుకునేలా తీర్చి దిద్దింది కంపెనీ.

ఐగో ఎక్స్ ఇంటీరియ‌ర్ మ‌ల్టీ ఫంక్ష‌న్ స్టీరింగ్ వీల్ తో వ‌స్తుంది. దీని వెనుక 9 అంగుళాల డిజిట‌ల్ డ్రైవ‌ర్ డిస్ ప్లే ఉంది. ట‌యాటో ఐగో ఎక్స్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో అనుకూల‌మైన ఇన్ఫోటైన్ మెంట్ సిస్ట‌మ్ క‌లిగి ఉంది.

ఐగో ఎక్స్ 231 లీట‌ర్ల సైజుతో మంచి పెద్ద టూట్ స్థ‌లంతో వ‌స్తుంది. ట‌యోటా ఎన్ ఎం వ‌ర‌కు గ‌రిష్ట టార్క్ ఉత్ప‌త్తి చేస్తుంది. ఇంజ‌న్ సీవీటీ గేర్ బాక్స్ తో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

2022లో యూర‌ప్ మార్కెట్ లోకి మొద‌ట‌గా రానుంది. ఆ త‌ర్వాత ఇండియాలో ఎప్పుడు వ‌స్తుంద‌నేది ఇంకా తెలియ రాలేదు.

Also Read : మార్కెట్ లోకి జియో ఫోన్ నెక్ట్స్

Leave A Reply

Your Email Id will not be published!