#SpiceJet : డ‌బ్బులు లేక పోయినా ఫ్లైట్స్ ఎక్కొచ్చు

ప్ర‌యాణికుల‌కు స్పైస్ జెట్ బంప‌ర్ ఆఫ‌ర్

Spice Jet  : డ‌బ్బులు ఉంటేనే ఎక్క‌డికైనా వెళ్ల‌గ‌లం. కానీ జేబులో చిల్లి గ‌వ్వ లేక పోయినా స‌రే గాలి మోటర్ ఎక్కితే ఎలా ఉంటుంది. దానినే నిజం చేస్తోంది భార‌తీయ ప్ర‌ముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్.

ఈ మేర‌కు మీ అకౌంట్లో డ‌బ్బులు వుంటే చాలు. ప్ర‌యాణికులకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా బ్యాంకింగ్ , రీటైల్ , ఈ కామ‌ర్స్ తో పాటు వినియోగ‌దారుల‌కు ఇప్ప‌టికే ఈఎంఐ ( నెల నెలా చెల్లింపు ) స‌దుపాయాన్ని ఇస్తున్నాయి.

దీనినే ఇంప్లిమెంట్ చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది స్పైస్ జెట్(Spice Jet ). దీంతో ఇవాల్టి నుంచి ఈ స‌దుపాయం ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది ఈ సంస్థ‌.

విమానంలో జ‌ర్నీ చేయాల‌ని అనుకునే వారు ఈఎంఐ సౌక‌ర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్ల‌ను కొనుగోలు చేసే చాన్స్ ఇచ్చింది. 3 , 6, 12 నెల‌ల పాటు వాయిదా ప‌ద్ద‌తుల్లో వ‌డ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధ‌ర మొత్తాన్ని ఈఎంఐ లో చెల్లించ వ‌చ్చు.

ఈ అద్భుత‌మైన అవ‌కాశం చేజిక్కించు కోవాలంటే చేయాల్సింది ఒక్క‌టే. ఆయా ప్రాంతాల‌కు వెళ్లాల‌ని అనుకునే వారు పాన్ నెంబ‌ర్ , ఆధార్ కార్డు, వీఐడీ వివరాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది.

స్పైస్ జెట్ కు సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అందులో వ‌న్ టైమ్ పాస్ వ‌ర్డ్ తో యాక్టివ్ చేసుకోవాలి. ప్ర‌యాణీకులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

మ‌రో స‌దుపాయం క‌ల్పించింది సంస్థ‌. ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివ‌రాలు అందించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : య‌జ‌మాని ఔదార్యం ఉద్యోగుల‌కు బ‌హుమానం

Leave A Reply

Your Email Id will not be published!